Site icon NTV Telugu

Dhaakad : నాలుగు భాషల్లో హల్చల్ చేయబోతున్న కంగనా!

dhaakad

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సినిమాలు గత కొంతకాలంగా దక్షిణాది భాషల్లోనూ అనువాదమౌతున్నాయి. ఆమె తాజా చిత్రం ‘ధాకడ్’ సైతం ఇప్పుడు హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ డబ్ కానుంది. చైల్డ్ ట్రాఫికింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘ధాకడ్’ మూవీని నిజానికి గత యేడాది అక్టోబర్ 1న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో ఈ యేడాది ఏప్రిల్ నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ నెలలో ఎక్కువ సినిమాలు ఉండటంతో ఇప్పుడు దర్శక నిర్మాతలు కొత్త డేట్ ను ప్రకటించారు. మే 27వ తేదీన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పారు.

Read Also : Vijay Deverakonda : లుక్ మార్చిన హీరో… ‘జన గణ మన’ కోసం కొత్త మేకోవర్

ఈ యాక్షన్ మూవీలో కంగనా ఏజెంట్ అగ్ని పాత్రను పోషిస్తోంది. ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్ మాఫియాకు అగ్ని ఎలా చెక్ పెట్టిందన్నదే ఈ చిత్రకథ. ఈ మూవీకి సంబంధించిన యాక్షన్స్ సన్నివేశాలను ఆ మధ్య బుడాపెస్ట్ లోనూ చిత్రీకరించారు. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహిస్తున్న ‘ధాకడ్’లో అర్జున్ రామ్ పాల్ నెగెటివ్‌ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. దివ్యా దత్, షరీబ్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మధ్య కాలంలో తన నటనతో కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో ఉంటున్న కంగనా రనౌత్ మరి ఏజెంట్ అగ్నిగా ఎలా మెప్పిస్తుందనేది వేచి చూడాలి. ఇదిలా ఉంటే, ఈ సినిమా విడుదల కాబోతున్న మే 27వ తేదీన వెంకటేశ్, వరుణ్ తేజ్ ‘ఎఫ్ 3’, అడివి శేష్‌ పాన్ ఇండియా మూవీ ‘మేజర్‌’ చిత్రాలు విడుదల కానున్నాయి. అలానే ‘ఉప్పెన’ ఫేమ్ వైష్ణవ్ తేజ్ ‘రంగరంగ వైభవంగా’ సినిమానూ అదే తేదీ విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో కంగనా చిత్రానికి తెలుగులో ఎన్ని థియేటర్లు దొరుకుతాయన్నది అనుమానమే!

Exit mobile version