NTV Telugu Site icon

Kangana Ranaut: తన డ్రీమ్ ఫుల్ ఫీల్ చేసుకున్న కంగనా.. వీడియో వైరల్

February 7 (35)

February 7 (35)

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ గురించి పరిచయం అక్కర్లేదు. ఎప్పుడు ఏదో ఓ విషయంలో హైలెట్ అవుతూనే ఉంటుంది. సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా వ్యాపార రంగంలోనూ తన ప్రతిభ చాటుకోవడానికి సిద్ధం అయ్యింది. ఈ క్రమంలో తాజాగా కంగన్న బిజినెస్‌ లోకి అడుగుపెడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మనకు తెలిసి చాలా మంది హీరోలు, హీరోయిన్‌లు, ఇతర నటినటులు సినిమాల్లో నటిస్తునే పలు బిజినెస్‌లు కూడా చేపడుతుంటారు. ఇక ఇప్పుడు కంగనా కూడా వారి బాటలో నడుస్తుంది.

Also Read:Thiruveer: వరుస సినిమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో..

రీసెంట్ గా ఆమె తన మొదటి బిజినెస్ ను సొంత ప్రాంతం హిమాచల్‌ ప్రదేశ్‌లో ప్రారంభం చేసింది.‘ది మౌంటైన్‌ స్టోరీ’ పేరుతో హిమాలయాల్లో కేఫ్‌ స్టార్ట్ చేసింది. ఫిబ్రవరి 14 నుంచి ఇది ప్రారంభం కానుంది. ఈమేరకు రెస్టారంట్‌ ఫొటోలను వీడియో రూపంలో నెటిజన్‌లతో పంచుకుంది. ‘సంప్రదాయ హిమాచల్‌ ఫుడ్‌ను మోడ్రన్‌ అభిరుచులకు అనుగుణంగా అందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటుచేశాను. ఇది నా చిన్ననాటి కల ఎట్టకేలకు ప్రాణం పోసుకుంది. ఈ హిమాలయాల ఒడిలో నా చిన్న కేఫ్. ది మౌంటెన్ స్టోరీ.. ఇదొక ప్రేమకథ’ అని ఆమె వీడియో లో పేర్కొంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఇప్పటికే పలువురు హీరోయిన్లు.. శిల్పాశెట్టి, మలైకా అరోరా, మౌనీరాయ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి తారలకు కూడా రెస్టారంట్లు ఉన్నాయి. మరి కంగనా కు ఈ కేఫ్ ఎంతవరకు లాభం చేకురుస్తుందో చూడాలి.