Site icon NTV Telugu

సునీల్ క్రైమ్ థ్రిల్లర్ “కనబడుట లేదు” ట్రైలర్

Kanabadutaledu Trailer Out Now

ప్రముఖ కమెడియన్, నటుడు సునీల్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ “కనబడుటలేదు”. వైశాలిరాజ్, శుక్రనాథ్ వీరెల్లా, హిమజ్, ఉగ్రన్, ప్రవీణ్, రవి వర్మ, కిరీటి దామరాజు, కంచరపాలెం కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. బాలరాజు ఎం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. స్పార్క్, శ్రీపాద ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మధు పొన్నస్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ నెల 13న థియేట్రికల్ విడుదలకు “కనబడుట లేదు” సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.

Read also : నేను బాగానే ఉన్నాను : శారద

ట్రైలర్ చూస్తుంటే ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, అందులో ఒక ప్రేమికుడు సడన్ గా కన్పించకుండా పోవడం కన్పిస్తోంది. డంప్ యార్డ్‌లో ఒక శవం కన్పించడం, ఈ అనుమానాస్పద కేసును పరిష్కరించడానికి డిటెక్టీవ్ సునీల్ నియమించబడడం, ఆయన కేసును డీల్ చేస్తున్న విధానం ఆసక్తికరంగా కన్పిస్తోంది. సునీల్ ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో వస్తున్నాడు దర్శకుడు బాలరాజు మిస్టరీ మ్యాన్ గురించి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సరికొత్త క్రైమ్ స్టోరీని తీసుకున్నారు. ఆసక్తికరంగా సాగుతున్న ఈ ట్రైలర్ ను మీరు కూడా వీక్షించండి.

https://www.youtube.com/watch?v=PRRwNyMtE4E
Exit mobile version