ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలలో ప్రాజెక్ట్-k సినిమా కూడా ఒకటి. ఈ సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు కూడా నెలకొన్నాయి.. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.ఇందులో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే, నటుడు అమితాబచ్చన్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల అప్డేట్లను అభిమానులను చాలా ఆసక్తికి గురయ్యేలా అయితే చేసింది.తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారుతోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కమలహాసన్ కూడా విలన్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమా ఇప్పటివరకు ఊహించని విధంగా ఉండబోతుందని ఈ చిత్రంలో కమలహాసన్ పాత్ర మరింత హైలైట్ గా కాబోతోందని టాక్ నడుస్తుంది..
ఈ చిత్రంలోని కమల్ హాసన్ పాత్ర కోసం ఏకంగా రూ .150 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదుకమలహాసన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని విలన్ రోల్ చేయడానికి కమలహాసన్ కూడా ఒప్పుకున్నట్లుగా సమాచారం. ఈ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.ప్రభాస్ సినిమాలో కమలహాసన్ భాగమవుతూ ఉండడంతో అభిమానులు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. మొదటిసారి ప్రతి నాయకుడుగా కమలహాసన్ నటించిన ఈ సినిమా పై భారీ అంచనాలు కూడా ఏర్పడ్డాయి.. కమలహాసన్ ఓటీటి ల గురించి మాట్లాడుతూ ఓటీటి ల గురించి తాను కొన్ని సంవత్సరాల ముందే చెప్పానని.. ఆ సమయంలో ఇండస్ట్రీలోని ఎవరు కూడా తన మాటలు పట్టించుకోలేదని తెలియజేశారు.