Site icon NTV Telugu

Vikram Trailer: కమల్ హాసన్ ‘విక్రమ్’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Vikram Movie

Vikram Movie

వయసు మళ్లినా కమల్‌ హాసన్ యువ హీరోలకు ధీటుగా యాక్షన్ సినిమాల్లో నటిస్తున్నాడు. అయితే కొంతకాలంగా హిట్ సినిమా కోసం కమల్ తీవ్రంగా కృషి చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో కమల్‌ హాసన్ నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ మూవీ విక్రమ్. ఈ సినిమాకు ‘మాస్టర్’ ఫేం లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించాడు. రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌ పతాకంపై కమల్‌ హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి టైటిల్ టీజ‌ర్ నుంచి ఇటీవ‌ల విడుద‌లైన మేకింగ్ గ్లింప్స్ వరకు అన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా చిత్ర బృందం మ‌రో అప్‌డేట్‌ ప్రకటించింది.

విక్రమ్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మే 15న చెన్నైలో జ‌ర‌గ‌నున్నట్లు మేక‌ర్స్ ప్రక‌టించారు. అంతేకాకుండా అదే రోజు ట్రైల‌ర్‌ కూడా విడుద‌ల చేస్తామని వెల్లడించారు. కమల్‌హాసన్ కెరీర్‌లో 232వ సినిమాగా ‘విక్రమ్’ తెరకెక్కుతోంది. ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగు, మ‌ల‌యాళ‌ం, హిందీ, క‌న్నడ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఫాహ‌ద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి వంటి స్టార్ హీరోలు ఈ చిత్రంలో న‌టిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న ఈ మూవీ విడుదల కానుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ డిస్నీ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. కాగా ఈ చిత్ర ట్రైలర్‌ను ఈనెల 18న పారిస్‌లోని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబోతున్నారు.

Exit mobile version