Kamal Haasan: వయసు 70 దాటినా కుర్ర హీరోలకు నిద్రలేకుండా చేస్తున్నారు లోకనాయకుడు కమల్ హాసన్. బాక్సాఫీస్ వద్ద సరికొత్త విధ్వంసం సృష్టించేందుకు ఏకంగా అరడజను (6) భారీ ప్రాజెక్టులతో మునుపెన్నడూ చూడని రీతిలో మోస్ట్ పవర్ఫుల్ లైనప్‌ను సెట్ చేసుకున్నారు. ఇందులో హీరోగా మూడు భారీ చిత్రాలు చేస్తుండగా, తన సొంత బ్యానర్‌పై నిర్మాతగా మరో మూడు క్రేజీ సినిమాలను లైన్లో పెట్టి మొత్తం సినీ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు.
హీరోగా కమల్ వేస్తున్న అడుగులు చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. శంకర్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మక ‘భారతీయుడు 3’ ఇప్పటికే లైన్లో ఉండగా.. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి చేయబోయే భారీ మల్టీస్టారర్ ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ సెన్సేషన్‌గా నిలవనుంది. ఇక ముచ్చటగా మూడో చిత్రంగా ‘చిన్నా’ దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు. నవంబర్ 7న కమల్ పుట్టినరోజు సందర్భంగా ఈ క్రేజీ మూవీపై అధికారిక ప్రకటన వెలువడనుండగా.. చెన్నైలో 15 రోజుల ఫస్ట్ షెడ్యూల్, ఆ వెంటనే తెన్‌కాశీలో రెండో షెడ్యూల్ కోసం చిత్ర బృందం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
నటనతోనే సరిపెట్టకుండా, తన సొంత నిర్మాణ సంస్థ ‘రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్‌పై ఏకకాలంలో మరో మూడు భారీ చిత్రాలను నిర్మిస్తూ బిజీయెస్ట్ ప్రొడ్యూసర్‌గానూ చక్రం తిప్పుతున్నారు కమల్. ఓవైపు శంకర్, నెల్సన్, అరుణ్ కుమార్ లాంటి విలక్షణ డైరెక్టర్లతో హీరోగా సినిమాలు.. మరోవైపు ప్రొడ్యూసర్‌గా మూడు చిత్రాలు.. ఇలా ఏకకాలంలో ఆరు ప్రాజెక్టులతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న కమల్ మాస్ స్పీడ్‌ను చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

