Site icon NTV Telugu

NTR31: తారక్ vs కమల్ హాసన్..?

Ntr Vs Kamal Haasan

Ntr Vs Kamal Haasan

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన #NTR31 అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానే వచ్చేసింది. జూ. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అతను తన 31వ ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ నీల్‌తో జత కడుతున్నాడని తేలింది. ఇదే సమయంలో తారక్ ఇంటెన్స్ లుక్‌ని కూడా రిలీజ్ చేశారు. దీంతో, సర్వత్రా ఈ ప్రాజెక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది కూడా!

ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మరో క్రేజీ గాసిప్ తెగ చక్కర్లు కొడుతోంది. లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నాడన్నదే ఆ గాసిప్ సారాంశం. ఇందులో ఆయన విలన్‌గా నటించనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ నరేట్ చేసిన స్టోరీ, డిజైన్ చేసిన విలన్ రోల్‌తో ఇంప్రెస్ అవ్వడం వల్లే.. కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలొస్తున్నాయి. అయితే, దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఈ రూమర్ నిజమే అయితే మాత్రం.. ఇద్దరు సూపర్ ట్యాలెంటెడ్ పవర్‌హౌస్‌లను వెండితెరపై చూసే సౌభాగ్యం ప్రేక్షకులకు దక్కుతుంది.

ఇదిలావుండగా.. తారక్ పుట్టినరోజు నాడే NTR30 అనౌన్స్‌మెంట్ కూడా వచ్చింది. కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్‌లో రూపొందుతోంది. అటు, కమల్ హాసన్ తన విక్రమ్ సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ కూడా కీలక పాత్రల్లో నటించడంతో, దీనిపై భారీ అంచనాలున్నాయి.

Exit mobile version