Thuglife : థగ్ లైఫ్ ఫస్ట్ డే కలెక్షన్లు.. మరీ ఇంతేనా..?
- మొదటి నుంచే నెగెటివ్
- సోషల్ మీడియాలో ట్రోల్స్
- దారుణంగా కలెక్షన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thuglife : కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ మూవీ చాలా వివాదాల నడుమ జూన్ 5న థియేటర్లలో విడుదల చేశారు. కన్నడ భాషపై చేసిన కామెంట్స్ తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగతా భాషల్లో రిలీజ్ చేశారు. కానీ లాభం లేకుండా పోయింది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చేసింది. విడుదలకు ముందు నుంచే సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. దెబ్బకు ఫస్ట్ డే కలెక్షన్లపై భారీ దెబ్బ పడింది.
Read Also : Kannappa : కన్నప్పలో రజినీకాంత్ ను తీసుకుందామనుకున్నా.. విష్ణు కామెంట్స్ వైరల్
Also Read
మొదటి రోజు రూ.17 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇది మరీ తక్కువ కాకపోయినా.. గత సినిమాలతో పోలిస్తే చాలా తక్కువ. కమల్ నటించిన ఇండియన్-2 మూవీ భారీ డిజాస్టర్. అయినా మొదటి రోజు రూ.25 కోట్లు వచ్చాయి. కమల్-మణిరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వస్తున్న సినిమా కావడంలో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి. పైగా శింబు, త్రిష కూడా ఉన్నారు.
ప్రమోషన్లు భారీగానే చేశారు. ఇంత చేసినా సరే ఫస్ట్ డే కలెక్షన్లు అనుకున్న దాంట్లో సగం కూడా రాలేదు. మొదటి రోజే మూవీ ఫలితం ఏంటో తేలిపోయింది. కాబట్టి రెండో రోజు నుంచే కలెక్షన్లు మరింత పడిపోవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ పండితులు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో వచ్చిన సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని ఇవ్వలేకపోయింది. మణిరత్నం మరోసారి గ్యాంగ్ స్టర్ కథనే నమ్ముకున్నా.. కంటెంట్ లో, స్క్రీన్ ప్లేలో ఆకట్టుకునే అంశాలు చాలా తక్కువ. అదే బెడిసికొట్టింది.
Read Also : Trump-Musk: ట్రంప్, మస్క్ మధ్య దోస్తాన్ ఎక్కడ చెడింది..?
తాజావార్తలు
-
Tejaswi Rao: ఇక పద్ధతిగా ఉంటే కుదరదు.. అందాల విందుతో రాంబాయి అరాచకం!
-
‘Raaka’ Glimpse: ‘రాకా’ ఫ్యాన్స్‌కు షాక్.. ఇప్పటి వరకు ఊరించిందంతా ఉత్తిదేనా?
-
Iran Crisis: సంక్షోభంలో ఇరాన్.. బతకడానికి ‘‘జుట్టు’’ అమ్ముకుంటున్న జనాలు..
-
AP High Court: డీఎస్సీ-2025 పిల్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. రాజకీయ ప్రయోజనాలకు పిల్‌ను వాడొద్దు..!
-
Raashi Khanna: హే రాశి.. ఇప్పుడెందుకీ క్లీవేజ్ షో?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!