NTV Telugu Site icon

Kamal Haasan: హిందీ వివాదంపై కమల్ సంచలన వ్యాఖ్యలు.. అల్టిమేటమ్ జారీ

Kamal Haasan

Kamal Haasan

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నార్త్- సౌత్ కు మాటల యుద్ధం జరుగుతున్నా విషయం విదితమే. బాలీవుడ్ అంతా సౌత్ సినిమాలపై విరుచుకుపడుతున్నారు. తమ సినిమాలు కనీసం మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడుతుంటే సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవల్లో హిట్లు అందుకోవడం వారికి కన్ను కుట్టినట్లవుతోంది. దీంతో సౌత్ ఇండస్ట్రీపై పలువురు పలు వివాస్పద వ్యాఖ్యలు చేయడం.. వాటికి సౌత్ యాక్టర్స్ కౌంటర్లు ఇవ్వడం జరుగుతూనే ఉన్నాయి. ఇక తాజాగా ఈ వివాదంపై విశ్వనటుడు కమల్ హాసన్ స్పందించారు. ఇటీవల ఆయన నటించిన విక్రమ్ సినిమా ట్రైలర్ అండ్ ఆడియో లాంచ్ లో ఈ వివాదంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

” సినిమా.. రాజకీయాలు కవల పిల్లలు..అదే నేను చేస్తున్నా. తమిళం వర్థిల్లాలి అని చెప్పడం నా భాధ్యత. దీనికి ఎవరు అడ్డు వచ్చినా ఎదుర్కొంటా. దీనికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదు. నేను హిందీని వ్యతిరేకించడం లేదు.. అలా అని తమిళ్ భాష జోలికి వస్తే ఊరుకోను. చిన్నతనంలో శివాజీ గణేషన్‌ ఇంటికి ఎక్కువగా వెళుతుండే వాడిని. అలా తనకు తొలి గురువు ఆయన అయితే రెండవ గురువు గీత రచయిత వాలి. వారి వల్లే నేనిక్కడ ఇలా మాట్లాడగలుగుతున్నాను. అందుకే తమిళ్ ఎప్పుడూ వర్ధిల్లాలి. దాంతో పాటు అన్ని భాషలు నేర్చుకోవాలి. అన్ని భాషలు కలిస్తేనే ఇండియా “అని కమల్ అల్టిమేటం జారీ చేశారు. మరి కమల్ వ్యాఖ్యలకు బాలీవుడ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.