Site icon NTV Telugu

Kamal Haasan: ‘విక్రమ్’ షూటింగ్ పూర్తి.. పార్టీ లేదా అని అడిగిన ఫహద్ ఫాజిల్

విశ్వనటుడు కమల్ హాసన్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు ఫస్ట్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘విక్రమ్‌’. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. ఈ విషయాన్ని దర్శకుడు లోకేష్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు. చిన్నపాటి వీడియోను విడుదల చేస్తూ మూవీకి గుమ్మడికాయ కొట్టినట్టు చెప్పారు. విశేషం ఏమంటే… ఈ బుల్లి వీడియోలో ఫహద్ ఫాజిల్ గన్ పేల్చుతున్న విజువల్ ఉంది.

అనంతరం ఫహద్ ఫాజిల్ దర్శకుడు లోకేష్‌ను ఉద్దేశించి, ‘పార్టీ లేదా పుష్ప’ అనే డైలాగ్ చెప్పారు. ఇటీవల విడుదలై ‘పుష్ప’ సినిమాలో ఫహద్ చెప్పిన ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అతని నుంచి ఆ డైలాగ్ వచ్చే సరికీ ‘విక్రమ్’ మూవీ యూనిట్ సభ్యులందరూ హర్షధ్వానాలు చేశారు. 110 రోజుల పాటు సినిమా షూటింగ్ జరిగిందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో అద్భుతంగా పనిచేశారని లోకేష్‌ అన్నారు. కమల్ హాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో విజయ్ సేతుపతి మెయిన్ విలన్‌గా నటించాడు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘విక్రమ్’ సినిమాకు అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version