Site icon NTV Telugu

Kamal Haasan : శత్రుత్వాన్ని కోరుకోను.. బాధగా ఉంది.. కమల్ హాసన్ లేఖ..

Kamal

Kamal

Kamal Haasan : కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై అటు కన్నడ హైకోర్టు కూడీ సీరియస్ అయింది. మీరేమైనా చరిత్రకారులా.. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని మీరెలా అంటారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సారీ చెబితే అయిపోతుంది కదా అని సూచించింది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు సుదీర్ఘమైన లేఖ రాశారు. ‘నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నందుకు చాలా బాధగా ఉంది. మనమంతా (కన్నడ, తమిల్) ఒక కుటుంబం అని చెప్పడమే నా ఉద్దేశం. అంతే తప్ప ఏ భాషను కించ పరిచే వ్యక్తిని కాదు నేను.

Read Also : Chiranjeevi : నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. శేఖర్ కమ్ములపై చిరు పోస్ట్

నేను అన్ని భాషలను ప్రేమిస్తాను. నాకు సినిమా భాష తెలుసు. అది యూనివర్సల్. సినిమా అంటే మనుషులను కలిపే వారధి. విడదీసే గోడ కాదు. ఈ విషయం వల్ల శివన్న బాధపడటం చాలా విచారకరం. మనమంతా ఒక్కటే అని చెప్పడానికే శివన్న మా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చారు. తమిళంతో పాటు కన్నడ భాష కూడా నా ఎదుగుదలలో ఉంది. కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం.. ఇలా అన్ని భాషలను నేను ప్రేమిస్తాను. అన్ని భాషలతో నాకు అనుబంధం ఉంది. నను ఎలాంటి అశాంతిని, శత్రుత్వాన్ని కోరుకోను’ అంటూ కమల్ హాసన్ రాసుకొచ్చాడు.

కమల్ హాసన్ థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. తమిళ భాష నుంచే కన్నడ భాష పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక రాజకీయా పార్టీలతో పాటు ఫిల్మ్ ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేఎఫ్ సీసీ ఏకంగా హైకోర్టుకు వెళ్లి థగ్ లైఫ్ మూవీని ఆపాలంటూ పిటిషన్ వేసింది. దీనిపై తాజాగా కమల్ హాసన్ ఈ విధంగా స్పందించారు. కానీ ఇందులో ఎక్కడా క్షమాపణ చెప్పలేదు. మరి ఈ లేఖతో వివాదం ఆగుతుందా లేదా అనేది చూడాలి.

Read Also : Kalpika Ganesh : డిస్కౌంట్ అడగలేదు.. డిసర్ట్ అడిగితే గొడవ పడ్డారు.. కల్పిక క్లారిటీ..

Exit mobile version