Site icon NTV Telugu

Thuglife : థగ్ లైఫ్‌ ను కర్ణాటకలో రిలీజ్ చేయను.. కమల్ సంచలనం..

Thuglife

Thuglife

Thuglife : కమల్ హాసన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలో తన సినిమా థగ్ లైఫ్ ను రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు. కన్నడ భాష వివాదంపై హైకోర్టులో విచారణ సందర్భంగా కమల్ హాసన్ తరఫున లాయర్ ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. థగ్ లైఫ్ ఈవెంట్ లో కన్నడ భాషపై కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. ఆయన థగ్ లైఫ్ మూవీని బ్యాన్ చేయాలంటూ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కర్ణాటక హైకోర్టను ఆశ్రయించింది. ఈ విషయంపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

Read Also : Amardeep-Supritha : ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ గ్లింప్స్ రిలీజ్..

దాంతో కమల్ హాసన్ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు సుదీర్ఘ లేఖ రాశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చుకున్నారు. కానీ అందులో ఎక్కడా సారీ చెప్పలేదు. హైకోర్టులో మరోసారి ఈ పిటిషన్ విచారణకు రాగా.. కమల్ తరఫున న్యాయవాది ఆ లెటర్ ను న్యాయస్థానానికి అందజేశారు. అది చూసిన ధర్మాసనం.. ఇందులో ఎక్కడా సారీ చెప్పకపోవడాన్ని గుర్తు చేసింది.

కమల్ హాసన్ ఒక భాషను ఉద్దేశించి ఆ కామెంట్ చేయలేదని.. ఒక వ్యక్తిని ఉద్దేశించి మాత్రమే చేశారని.. ఒకవేళ ఇప్పటికీ కర్ణాటకలో పరిస్థితి అలాగే ఉంటే థగ్ లైఫ్ మూవీని కన్నడలో ప్రస్తుతానికి రిలీజ్ చేయట్లేదని న్యాయవాది తెలిపారు. కన్నడ ఫిల్మ్ ఛాంబర్ తో చర్చలు జరుపుతామని.. తమకు వారం రోజులు గడువు కావాలని కోరారు. దీంతో కోర్టు విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.

Read Also : Chiranjeevi : నువ్వు ఉన్నత శిఖరాలకు ఎదగాలి.. శేఖర్ కమ్ములపై చిరు పోస్ట్

Exit mobile version