NTV Telugu Site icon

Kamal And Rajini: విక్రమ్ మీట్స్ జైలర్.. పర్ఫెక్ట్ పిక్చర్

Kamal

Kamal

Kamal And Rajini: ఇద్దరు స్టార్ హీరోలు ఒకే చోట చేరితే.. ఆరోజు ఫ్యాన్స్ కు పండగే. ఒకే ప్లేస్ లో రెండు సినిమాలు షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఒక హీరో వెళ్లి మరో హీరోను పలకరించడం జరుగుతూ ఉంటుంది. అది అందరికి తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. కోలీవుడ్ స్టార్ హీరోస్.. ఒకే ఫ్రేమ్ లో మరోసారి కనిపించి ఫిదా చేసారు. ఆ స్టార్ హీరోస్ ఎవరో కాదు.. సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్. వీరికి వయస్సుతో సంబంధం లేదు. 60 దాటినా కూడా ఇంకా కుర్ర హీరోలలానే వరుస సినిమాలను చేస్తూ.. కుర్ర హీరోలకే దడలు పుట్టిస్తున్నారు. ఇక ప్రస్తుతం కమల్.. ఇండియన్ 2 షూటింగ్ తో బిజీగా ఉండగా .. రజినీ తలైవర్ 170 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలను నిర్మిస్తుంది లైకా ప్రొడక్షన్స్ కావడం విశేషం.

Srikanth N Reddy: ఆదికేశవ.. అందరిని ఆకట్టుకుంటుంది

నేడు షూటింగ్ కోసం వచ్చిన ఈ ఇద్దరు లెజెండ్స్.. మీట్ అయ్యాయి.. కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. దాదాపు 21 ఏళ్ళ తరువాత వీరు ఒకే స్టూడియోలో కలిసి ఉండడం విశేషమని మేకర్స్ చెప్పుకొచ్చారు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను లైకా ప్రొడక్షన్స్ షేర్ చేస్తూ.. ” ఇండియన్ సినిమా ఖ్యాతిని పెంచిన ఇద్దరు లెజెండ్స్ కమల్ హాసన్, రజినీకాంత్.. తమ ఫిల్మ్స్ అయిన ఇండియన్ 2 , తలైవర్ 170 కోసం 21 ఏళ్ళ తరువాత ఒకే స్టూడియోలో కలిసిన మధుర క్షణం. లైకాప్రొడక్షన్స్ ఈ రెండు చిత్రాలను నిర్మిస్తున్నందుకు చాలా సంతోషంగా మరియు గర్వంగా ఉంది” అని రాసుకొచ్చింది. మరి ఈ రెండు సినిమాలతో లైకా ఎలాంటి విజయ కేతనం ఎగురవేస్తుందో చూడాలి.

Show comments