NTV Telugu Site icon

SidKiara: పెళ్లికి ముందే కియారా ప్రెగ్నెంట్.. బాంబ్ పేల్చిన నటుడు

Sid Kiara

Sid Kiara

SidKiara: టైటిల్ చూడగానే.. ఏం మాట్లాడుతున్నావ్ రా.. నరాలు కట్ అయ్యిపోయాయి అని తిట్టకోకండి. ఈ వార్త రూమర్ కాదు బాలీవుడ్ క్రిటిక్, నటుడు కెఆర్ కె(KRK) నిర్మొహమాటంగా ట్విట్టర్ లో చెప్పుకురావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. వారం క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్ మల్హోత్రా- కియారా అద్వానీ వివాహంతో ఒక్కటయ్యారు. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అన్న విషయం అందరికి తెల్సిందే. కానీ, ఏ రోజు కూడా వీరిద్దరూ.. తాము రిలేషన్ లో ఉన్నట్లు అధికారికంగా చెప్పింది లేదు. ఇక సడెన్ గా వీరి పెళ్లి జరగబోతుందని మీడియా కోడై కూసింది. చెప్పినట్లుగానే అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. గత రాత్రి వీరి రిసెప్షన్ ముంబైలో గ్రాండ్ గా జరిగింది. సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది అనుకొనేలోపు బాలీవుడ్ క్రిటిక్ కెఆర్ కె(KRK) పెద్ద బాంబ్ పేల్చాడు.

Prabhas: మొహమాటానికి పోయి సినిమాలు చేయకు ప్రభాస్ అన్నా..?

కమల్ ఆర్ ఖాన్.. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సీక్రెట్స్ ను బాహాటం చేయడంలో మనోడు ముందు ఉంటాడు. వివాదాలను కొని తెచ్చుకోవడంలో కెఆర్ కె స్పెషలిస్ట్. అప్పట్లో ఆర్ఆర్ఆర్ సినిమాను గే సినిమా అని అందరు చేత చివాట్లు కూడా తిన్నాడు. ఇక తాజాగా ఇతగాడు ఒక ట్వీట్ చేశాడు. ” ప్రస్తుతం బాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తోంది.. ముందు ప్రెగ్నెంట్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఇటీవల పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయ్యారు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బాలీవుడ్ లోనే కాదు ఇండస్ట్రీ మొత్తంలో కియారా పెళ్లిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు ఇప్పటివరకు తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించని ఈ జంట సడెన్ గా పెళ్లి చేసుకోవడానికి కారణం ఇదే అయ్యి ఉంటుందని కొందరు అంటుండగా.. ఇంకొందరు.. ఇప్పుడేమైంది పెళ్లి చేసుకున్నది వారిద్దరే కదా.. అది బాలీవుడ్ లో కామనే అని ఇంకొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వార్తలపై కొత్త జంట ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

Show comments