Kalyanram about Devara Movie Updates: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీ షూటింగ్‍లో ఫుల్ బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆర్ఆర్ఆర్ సినిమా గ్లోబల్ హిట్ అయ్యాక ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రానుండగా పార్ట్-1 చిత్రం 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా షూటింగ్ 2024 జనవరి మూడో వారంలో పూర్తవుతుందని ఆ సినిమా వర్గాల నుంచి సమాచారం బయటికి వచ్చింది. గోవా తీర ప్రాంతంలో ఈ మూవీ ఎక్కువ భాగం షూట్ జరుగగా ఈ సినిమా గురించి నిర్మాతల్లో ఒకరైన కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు.
Salaar: సలార్ ఫస్ట్ సింగిల్.. సూరీడు వచ్చేది ఎప్పుడంటే.. ?
అప్డేట్స్ గురించి వద్దని మొన్న తమ్ముడు కూడా చెప్పాడు కానీ నేను చెబుతా అని మొదలు పెట్టి ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తరువాత సినిమా చేయాలంటే ఒక హీరో, డైరెక్టర్ లేదా ప్రొడక్షన్ హౌస్ కి చాలా బాధ్యత ఉంటుంది. ఒక చిన్న అప్డేట్ లో కూడా చిన్న తేడా ఉంటే మీరు ఊరుకుంటారా? మీకు ఒక మంచి ప్రోడక్ట్ ఇచ్చే ముందు మేము ఎంత ఆలోచించాలి? ఇంతకన్నా ఎక్కువ ఆలోచించాలి అని అన్నారు. త్వరలో గ్లింప్స్ రాబోతోంది, వీఎఫ్ఎక్స్ కి చాలా టైం పడుతుంది. కొత్త ప్రపంచాన్ని చూపించబోతున్నాం అందుకే వీఎఫ్ఎక్స్ టైం పడుతుంది తమ్ముడు సినిమా దేవర…. RRR తరువాత వచ్చే సినిమా కాబట్టి ఏ మాత్రం తప్పు చెయ్యకుండా… బాధ్యతగా తీసుకుని పని చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు.