NTV Telugu Site icon

Kalyani Malik : ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాత వర్ధంతి.. గుణపాఠానికి రెండేళ్లు అంటూ కీరవాణి సోదరుడి పోస్టు వైరల్!

Kalyani Malik Mahesh Koneru

Kalyani Malik Mahesh Koneru

Kalyani Malik Post on Mahesh Koneru goes viral: తెలుగు సినీ హీరో ఎన్టీఆర్ పీఆర్వో, నిర్మాతగా మారిన మహేష్ ఎస్ కోనేరు అకస్మాత్తుగా మరణించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. నిర్మాతగా మంచి ఫాంలోకి వస్తున్న మహేష్ కోనేరు ఇలా గుండెపోటుతో మరణించడంతో సన్నిహితులు సైతం అప్పట్లో షాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్‌కు మహేష్ కోనేరు క్లోజ్ ఫ్రెండ్, కాగా స్నేహితుడి అకాల మరణంతో ఎన్టీఆర్ సైతం అప్పట్లో ఎమోషనల్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్, నిర్మాతగా మహేష్ కోనేరుకు మంచి పేరు వచ్చింది నా నువ్వే, 118, మిస్ ఇండియా, తిమ్మరుసు వంటి సినిమాలను మహేష్ కోనేరు నిర్మించి విజిల్, మాస్టర్ వంటి చిత్రాలను తెలుగు డిస్ట్రిబ్యూట్ చేశారు.

Ravi Teja: ‘టైగర్’ కోసం రంగంలోకి స్టూడియో గ్రీన్.. ఇక నో టెన్షన్

ఇంకా యంగ్ హీరోలతో సినిమాలు లైనప్ పెట్టుకున్న సమయంలో మహేష్ మరణించారు. అయితే ఆయన మరణించి నేటికీ రెండేళ్లు పూర్తయ్యాయి. అయితే ఆయన మరణించిన విషయాన్ని పలువులు గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేస్తుండగా కీరవాణి సోదరుడు, సంగీత దర్శకుడు కళ్యాణి మాలిక్ మాత్రం ఒక పాఠం నేర్చుకుని రెండేళ్లు అని అంటూ పోస్టు పెట్టారు. అయితే మామూలుగా ఆయన ఇలా పోస్టు పెట్టి ఉంటే ఆరోగ్యం విషయంలో ఒక పాఠం నేర్చుకుని రెండేళ్లు అయి వుండవచ్చ అని అందరూ సర్డుకునే వారు కానీ ఆయన పెట్టిన పోస్టుకు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయడంతో అనేక అనుమానాలు తావిస్తున్నాయని కొందరు కామెంట్ సెక్షన్ ఆఫ్ చేయక ముందు కామెంట్ చేసిన వారు అభిప్రాయపడుతున్నారు. వీరు కలిసి కీర్తి సురేష్ మిస్ ఇండియా అనే సినిమా చేశారు. మరి ఆ సినిమా విషయంలో రావాల్సిన డబ్బు ఏమైనా ఉందా? లేక ఇంకా వేరే ఏమైనా కారణాలతో ఈ పాఠం అనే పోస్టు పెట్టారా? అనేది తెలియాల్సి ఉంది.

Mahesh Koneru

Show comments