NTV Telugu Site icon

DEVIL Censor : కళ్యాణ్ రామ్ ‘డెవిల్’ సెన్సార్ రిపోర్ట్

Devil First Single

Devil First Single

DEVIL Movie censor report: నందమూరి కళ్యాణ్ రామ్ స్పై పాత్రలో నటించిన థ్రిల్లర్ మూవీ ‘డెవిల్’ డిసెంబర్ 29న వరల్డ్ వైడ్గా గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఈ మూవీ. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ఎప్పటికప్పుడు డిఫరెంట్ మూవీస్‌ని చేస్తూ హీరోగా తనదైన ఇమేజ్ సంపాదించుకుంటున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డెవిల్’, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ ట్యాగ్ లైన్. సంయుక్త మీనన్, మాళవికా నాయర్ హీరోయిన్స్ గా అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై అభిషేక్ నామా ద‌ర్శ‌క నిర్మాత‌గా ఈ సినిమాను రూపొందించారు. డిసెంబ‌ర్ 29న ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది డెవిల్. నిజానికి రీసెంట్‌గా విడులదైన డెవిల్ మూవీ ట్రైలర్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ కూడా వచ్చింది. పీరియాడిక్ మూవీగా థ్రిల్లర్ జోనర్‌లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఆడియెన్స్‌కి ఓ సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది.

Kavya Thapar: కావ్య భలే సైలెంటుగా కానిచ్చేస్తుందే!

లేటెస్ట్‌గా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. 2 గంటల 26 నిమిషాలుగా రన్ టైమ్‌ను ఫిక్స్ చేశారు, ఇక సినిమా చూసిన సెన్సార్ మెంబర్స్ సినిమా బాగుందని, టీమ్ కి విషెష్ చెప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా కళ్యాణ్ రామ్ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను మెప్పించనున్నాయని అలాగే డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌ ఆడియెన్స్‌ని అలరించనున్నాయని అంటున్నారు. ఇక డెవిల్ సినిమాపై పాజిటివ్ టాక్‌ రావటంతో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగులో పలు సినిమాలు నిర్మించి హిట్లు అందుకున్న అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై డెవిల్ మూవీ రానుంది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ ఆధ్వర్యంలో డెవిల్ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన ప్రపంచాన్నే క్రియేట్ చేశారు మేకర్స్. ఈ డెవిల్ సినిమాకి సౌందర్ రాజన్ సినిమాటోగ్రఫీ తోడు కావటంతో విజువల్స్ నెక్ట్స్ రేంజ్‌లో మెప్పించనున్నాయని మేకర్స్ బలంగా చెబుతున్నారు. తమ్మిరాజు ఎడిటర్‌గా వర్క్ చేసిన ఈ సినిమాకి శ్రీకాంత్ విస్సా కథ, స్క్రీన్ ప్లే, మాటలను అందించారు.

Show comments