NTV Telugu Site icon

Kalyan Ram: బింబిసార రిజల్ట్ రిపీట్ అవుతుంది.. మళ్లీ కాలర్ ఎగరేస్తాం

Kalyan Ram Speech

Kalyan Ram Speech

Kalyan Ram Speech In Amigos Pre Release Event: నందమూరి కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘అమిగోస్’ సినిమా ఈనెల 10వ తేదీన విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజు గ్రాండ్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. బింబిసార ఈవెంట్‌లో చెప్పినట్టుగానే, ఈసారి కూడా తాను డిజప్పాయింట్ చేయనని నమ్మకంగా చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవ్వరని, మరోసారి కాలర్ ఎగరేస్తామని పేర్కొన్నాడు. ఈ మూవీని తీసుకొచ్చిన మైత్రీ మూవీ మేకర్స్‌కి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు. తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌ని తాను ఎంతలా ప్రేమిస్తానో, అలాగే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ అంటే అంతే ఇష్టమని తెలిపాడు.

Rishi Sunak: వలసదారులపై రిషిసునాన్ ఉక్కుపాదం.. మానవ హక్కుల ఒప్పందం నుంచి బయటకి..!

తనకు తెలిసినంతవరకు ‘రాముడు భీముడు’తో తాత సీనియర్ ఎన్టీఆర్ డ్యుయెల్ రోల్ సినిమాల్ని మొదలుపెట్టారని.. ఆ తర్వాత చిరంజీవి, బాలయ్య సహా మరెందరో డ్యుయెల్ రోల్ సినిమాలు చేశారని కళ్యాణ్ రామ్ తెలిపాడు. తన తమ్ముడు ఎన్టీఆర్ సైతం ‘జై లవ కుశ’లో ట్రిపుల్ రోల్ పోషించాడన్నాడు. అయితే.. ఆ సినిమాలన్నింటిలోని పాత్రలకు ఒక కామన్ పాయింట్ ఉంటుందని, ఆ పాత్రలు ఒకే కుటుంబానికి చెందినవని అన్నాడు. కానీ.. అమిగోస్‌లో మాత్రం తాను చేసిన ట్రిపుల్ రోల్‌కి అలాంటి లింక్ ఉంటుందని, మూడు వేర్వేరు పాత్రలని సీక్రెట్ రివీల్ చేసేశాడు. మనల్ని పోలిన వ్యక్తులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెప్తున్నట్టు.. అలాగే ముగ్గురు పోలిన వ్యక్తులతో ‘అమిగోస్’ సినిమాను కమర్షియల్ త్రిల్లర్‌గా రూపొందించామన్నాడు. ఇది తప్పకుండా ఒక ప్రత్యేక అనుభూతి ఇస్తుందని, అందరూ ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని నమ్మకాన్ని వెలిబుచ్చాడు.

Amigos Event: నాటు నాటు పాటకి డాన్స్ చేసిన బ్రహ్మాజీ… పడి పడి నవ్విన ఎన్టీఆర్

‘బింబిసార’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలా? అని తాను ఆలోచిస్తున్న తరుణంలో.. దర్శకుడు రాజేంద్ర రెడ్డి ‘అమిగోస్’ స్క్రిప్ట్ చెప్పాడని, ఇందుకు అతనికి థాంక్స్ చెప్తున్నానని కళ్యాణ్ రామ్ చెప్పాడు. తాను చాలాసార్లు విఫలమైనా.. తనని 18 ఏళ్లు భరించారని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అభిమానులకు తెలియజేశాడు. ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని, అతను మరెవ్వరో కాదు బ్రహ్మాజీ అంటూ కళ్యాణ్ తెలిపాడు. ఈ సినిమాలో ఆశికా రంగనాథ్ చాలా మంచి పాత్ర చేసిందని, ఈ చిత్రంతో ఆమె తెలుగుతెరకు గ్రాండ్‌గా పరిచయం కాబోతోందన్నాడు. ఫిబ్రవరి 10న రిలీజ్ కాబోతున్న తన సినిమాను ఆదరించాలని, తాను ఈ చిత్రంతో తప్పకుండా ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ అందిస్తానంటూ తన ప్రసంగాన్ని కళ్యాణ్ ముగించాడు.