Site icon NTV Telugu

Devara OTT: పొరపాటున దేవర స్ట్రీమింగ్ పార్ట్నర్ ఎవరో చెప్పేసిన కళ్యాణ్ రామ్

Devara

Devara

Kalyan Ram Reveals Devara OTT Streaming Partner Detail: ఎన్ఠీఆర్ హీరోగా నటిస్తున్న దేవర OTT స్ట్రీమింగ్ భాగస్వామిని అధికారికంగా రివీల్ చేసేశాడు ఆయన సోదరుడు, హీరో కళ్యాణ్ రామ్. నిజానికి ఆయన ప్రస్తుతం డెవిల్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఈ సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ OTT దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ పాన్-ఇండియన్ మూవీ దేవర డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని చెప్పాడు. అంటే ఒకరకంగా కళ్యాణ్ రామ్ దేవర OTT స్ట్రీమింగ్ భాగస్వామిని అధికారికంగా వెల్లడించినట్టు అయింది. దేవర సహనిర్మాతగా వ్యవహరిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం డిసెంబర్ 29న విడుదల కానున్న ‘డెవిల్’ సినిమా ప్రమోషన్స్‌లో ఉన్నారు. హీరోని తన సోదరుడి ‘దేవర’ గురించి అడగగా, కళ్యాణ్ రామ్ మొదటి భాగం 80% షూటింగ్ పూర్తి అయిందని -విజువల్ ఎఫెక్ట్స్ బాగా సాగుతున్నాయని స్పందించారు.

Prabhas: అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్టకు ‘ఆదిపురుష్’కి పిలుపు

ఇప్పటి వరకు వచ్చిన ఫలితం పట్ల టీమ్ సంతృప్తి చెందిందని చెప్పాడు. ఇక కళ్యాణ్ రామ్ చెబుతున్న దాని ప్రకారం, దేవర షూటింగ్ ఇప్పటికే 80% పూర్తయింది. అంతేకాక ఒక మంచి గ్లింప్స్ రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇక VFX పనులు పూర్తయిన తర్వాత డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. ఇక ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ నెట్‌ఫ్లిక్స్ దేవరా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని అన్నారు. నెట్ ఫ్లిక్స్ బాస్ “టెడ్ సరాండోస్‌తో మా చివరి మీటింగ్ లో నెట్‌ఫ్లిక్స్ ఎలా ప్రారంభమైంది? ప్రపంచవ్యాప్తంగా ఎలా అభివృద్ధి చెందుతోందనే అంశం మీద సాధారణంగా చర్చించామని అన్నారు. ప్రముఖ రచయిత-దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం ‘దేవర’ రెండు భాగాల వెర్షన్‌ను రూపొందిస్తున్నారు. కథకు మరింత వివరణాత్మక కథనం అవసరం కావడంతో సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించాలని చిత్రబృందం నిర్ణయించింది. అందులో భాగంగా ఏప్రిల్ 5, 2024, భారీ అంచనాలతో మొదటి భాగం తెరపైకి రానుంది.

Exit mobile version