Bimbisara: ఫస్ట్ ఛాయిస్ కళ్యాణ్ రామ్ కాదు.. ఆ స్టార్ హీరో?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kalyan Ram Is Not The First Choice For Bimbisara: రెండు నెలల పాటు మూగబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇప్పుడు ‘బింబిసార’ పుణ్యమా అని గర్జిస్తోంది. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకోవడంతో, ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. ముఖ్యంగా.. బీ & సీ సెంటర్లలో అయితే కాసుల వర్షం బాగానే కురిపిస్తోంది. ఈ చిత్రం కళ్యాణ్ కెరీర్‌ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే కాదు.. టాలీవుడ్ పూర్వవైభవాన్ని కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమాను.. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అతనెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
కళ్యాణ్ రామ్ ఈ ‘బింబిసార’ సినిమా చేయడానికి ముందు.. దర్శకుడు వశిష్ట్ మొదట రవితేజని సంప్రదించాడట! ఇద్దరి మధ్య కథాచర్చలు జరగడం, రవితేజకు కథ కూడా నచ్చడం జరిగిందట! కానీ.. ఎందుకో రవితేజ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి, కచ్ఛితంగా భారీతనం ఉంటుంది. మరి, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని కొత్త దర్శకుడైన వశిష్ట్ హ్యాండిల్ చేయగలడా? అనే అనుమానంతో రిజెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా రవితేజ రిజెక్ట్ చేయడంతో, కళ్యాణ్‌ని వశిష్ట్ సంప్రదించాడు. ఆయనది హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ ఉంది కాబట్టి, గ్రాఫిక్స్ సహా ఇతర నిర్మాణ ఖర్చులన్నీ భరించగలడన్న నమ్మకంతో, కళ్యాణ్‌తో సినిమా చేయాలని వశిష్ట్ ఫిక్స్ అయ్యాడట! అలా వారి కలయికలో ఈ ప్రాజెక్ట్ రావడంతో, హిట్ టాక్‌తో దూసుకెళ్తుండడం జరిగింది.
Also Read
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
- The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
- The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
- Varun Tej: పవన్ కళ్యాణ్ మాటలు గుర్తుచేసుకున్న వరుణ్ తేజ్..
తన వద్దకు వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్ని రవితేజ రిజెక్ట్ చేయడం పరిపాటి అయినట్టు కనిపిస్తోంది. గతంలోనూ ఇతను పోకిరి, పటాస్, ఊసరవెల్లి సహా మరెన్నో హిట్ చిత్రాల్ని వదులుకున్నాడు. వాటి స్థానంలో చెత్త సినిమాలు చేసి, ఫ్లాపులు చవిచూశాడు. రీసెంట్‌గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ కూడా ఎలా బోల్తా కొట్టిందో చూశారుగా! బింబిసారని రవితేజ రిజెక్ట్ చేయడంతో, కళ్యాణ్ రామ్ చాలాకాలం తర్వాత ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.
తాజావార్తలు
-
Modi-Netanyahu: మోడీకి నెతన్యాహు ఫోన్.. ఉద్రిక్తతల వేళ కీలక సంభాషణ
-
Botsa Satyanarayana: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి.. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి..
-
West Bengal: మసీదు లౌడ్‌స్పీకర్లపై బెంగాల్లో రగడ.. అమిత్ షా ముందు పంచాయతీ..
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!