Site icon NTV Telugu

Bimbisara: ఫస్ట్ ఛాయిస్ కళ్యాణ్ రామ్ కాదు.. ఆ స్టార్ హీరో?

Ravi Teja Bimbisara

Ravi Teja Bimbisara

Kalyan Ram Is Not The First Choice For Bimbisara: రెండు నెలల పాటు మూగబోయిన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఇప్పుడు ‘బింబిసార’ పుణ్యమా అని గర్జిస్తోంది. అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఆకట్టుకోవడంతో, ప్రేక్షకులు థియేటర్లపై దండయాత్ర చేస్తున్నారు. ముఖ్యంగా.. బీ & సీ సెంటర్లలో అయితే కాసుల వర్షం బాగానే కురిపిస్తోంది. ఈ చిత్రం కళ్యాణ్ కెరీర్‌ని తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడమే కాదు.. టాలీవుడ్ పూర్వవైభవాన్ని కూడా తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అలాంటి ఈ సినిమాను.. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేశాడన్న వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అతనెవరో కాదు.. మాస్ మహారాజా రవితేజ! అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.

కళ్యాణ్ రామ్ ఈ ‘బింబిసార’ సినిమా చేయడానికి ముందు.. దర్శకుడు వశిష్ట్ మొదట రవితేజని సంప్రదించాడట! ఇద్దరి మధ్య కథాచర్చలు జరగడం, రవితేజకు కథ కూడా నచ్చడం జరిగిందట! కానీ.. ఎందుకో రవితేజ ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి, కచ్ఛితంగా భారీతనం ఉంటుంది. మరి, ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని కొత్త దర్శకుడైన వశిష్ట్ హ్యాండిల్ చేయగలడా? అనే అనుమానంతో రిజెక్ట్ చేసినట్టు టాక్ వినిపిస్తోంది. ఇలా రవితేజ రిజెక్ట్ చేయడంతో, కళ్యాణ్‌ని వశిష్ట్ సంప్రదించాడు. ఆయనది హోమ్ ప్రొడక్షన్ బ్యానర్ ఉంది కాబట్టి, గ్రాఫిక్స్ సహా ఇతర నిర్మాణ ఖర్చులన్నీ భరించగలడన్న నమ్మకంతో, కళ్యాణ్‌తో సినిమా చేయాలని వశిష్ట్ ఫిక్స్ అయ్యాడట! అలా వారి కలయికలో ఈ ప్రాజెక్ట్ రావడంతో, హిట్ టాక్‌తో దూసుకెళ్తుండడం జరిగింది.

తన వద్దకు వచ్చిన బ్లాక్‌బస్టర్ సినిమాల్ని రవితేజ రిజెక్ట్ చేయడం పరిపాటి అయినట్టు కనిపిస్తోంది. గతంలోనూ ఇతను పోకిరి, పటాస్, ఊసరవెల్లి సహా మరెన్నో హిట్ చిత్రాల్ని వదులుకున్నాడు. వాటి స్థానంలో చెత్త సినిమాలు చేసి, ఫ్లాపులు చవిచూశాడు. రీసెంట్‌గా వచ్చిన రామారావు ఆన్ డ్యూటీ కూడా ఎలా బోల్తా కొట్టిందో చూశారుగా! బింబిసారని రవితేజ రిజెక్ట్ చేయడంతో, కళ్యాణ్ రామ్ చాలాకాలం తర్వాత ఒక మంచి విజయాన్ని అందుకున్నాడు.

Exit mobile version