NTV Telugu Site icon

Kalyan Ram Devil: ఈ మలయాళ హీరోయిన్ ని చాలా కొత్తగా చూపించారు…

Kalyan Ram Devil

Kalyan Ram Devil

Kalyan Ram Devil: బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా స్పై త్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినామాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏంజెట్ గా నటిస్తున్నారు. నవంబర్ 24న రిలీజ్ కానున్న డెవిల్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ మళయాళ బ్యూటీ మాళవిక నాయర్ కనిపించనుంది. డెవిల్ సినిమాలో మణిమేకల క్యారెక్టర్ లో మాళవిక నాయర్ నటిస్తోంది. ఈ పాత్రకు సంబందించిన ఫస్ట్ లుక్ ని మూవీ మేకర్స్ రిలీస్ చేశారు. ఇప్పటి వరకు క్యూట్ గా కనిపించే పాత్రలో హీరోయిన్ గా కనిపించే మాళవిక మొదటి సారి డెవిల్ సినిమాతో పవర్ ఫుల్ రోల్ ప్లే చేసినట్లు ఉంది. తన కొత్తలుక్ డెవిల్ సినిమాకి ఎంత వరకు హెల్స్ అవుతుందో చూడాలి.

ఇదిలా ఉంటే డెవిల్ సినిమా విషయంలో చాలా ఇష్యూస్ అవుతున్నాయి. ఈ సినిమాని అభిషేక్ నామా ప్రొడ్యూస్ చేస్తూ నవీన్ మేడారం డైరెక్ట్ చెయ్యాల్సి ఉంది. నవీన్ డెవిల్ సినిమా షూటింగ్ ని కూడా సగానికి పైగా కంప్లీట్ చేసాడు. సడన్ గా ఏమైందో తెలియదు కానీ నవీన్ మేడారం డెవిల్ నుంచి తప్పుకున్నాడు, ప్రొడ్యూసర్ అభిషేక్ నామా డైరెక్టర్ అయిపోయాడు. ఇంటర్నల్ గా డెవిల్ సినిమా విషయంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఎండ్ ఆఫ్ ది డే నవంబర్ 24న కళ్యాణ్ రామ్ ఖాతాలో పాన్ ఇండియా హిట్ పడుతుందో లేదో చూడాలి.