‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్, అదే జోష్ ని కంటిన్యు చేస్తూ ‘అమిగోస్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. కళ్యాణ్ రామ్ ని ‘సిద్దార్థ్’గా ఇంట్రడ్యూస్ చేస్తూ రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నందమూరి హీరో చాలా స్టైలిష్ గా ఉన్నాడు. ‘ఎంటర్ప్రెన్యూర్’ సిద్దార్థ్ ‘అమిగోస్’ వరల్డ్ లో ఒక లుక్ ఏ లైక్ క్యారెక్టర్ అంటూ మేకర్స్ ఈ పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ అనౌన్స్మెంట్ ట్వీట్ లో ‘Doppleganger’ అనే పదాన్ని మేకర్స్ వాడారు, దీనికి అర్ధం ‘బయలాజికల్ సంబంధం లేకున్నా, అచ్చం మన లాగే ఉండే ఒక వ్యక్తి’ అని అర్ధం.
Read Also: Nandamuri Kalyan Ram: కల్యాణ్ రామ్ భార్య.. బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
విక్రమార్కుడు సినిమాలో అత్తిలి సత్తిబాబు, విక్రం సింగ్ రాథోడ్ లాగా అన్నమాట. ఈ ఇద్దరూ అన్నదమ్ములు కాదు, తండ్రి కొడుకులు కాదు, బంధు మిత్రులు అసలే కాదు కానీ చూడడానికి మాత్రం ఒకేలా ఉంటారు. ఇలాంటి వాళ్లనే ‘Doppleganger’ అంటారు. మరి కళ్యాణ్ రామ్ ఎవరికి లుక్ ఏ లైక్ పర్సనాలిటీలాగా ఉన్నాడో తెలియాలి అంటే 2023 ఫిబ్రవరి 10 వరకూ ఆగాల్సిందే. ఆరోజే కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘అమిగోస్’ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. రాజేంద్ర రెడ్డి దైరెక్ట్ చేస్తున్న ‘అమిగోస్’ మూవీకి ‘ఘిబ్రాన్’ మ్యూజిక్ అందిస్తున్నాడు. 2022లో ‘బింబిసార’ ఇచ్చిన హిట్ ని నిలబెట్టుకోని, కళ్యాణ్ రామ్ సక్సస్ ట్రాక్ ని కంటిన్యు చెయ్యాలి అంటే ‘అమిగోస్’ సినిమా పక్కా హిట్ అవ్వాల్సిందే. మరి ప్రయోగాలు ఎక్కువగా చేసే ఈ నందమూరి హీరో ఈసారి ఎలాంటి ఎక్స్పరిమెంట్ చేశాడో చూడాలి.
Introducing @NANDAMURIKALYAN as Siddharth, an entrepreneur, but more importantly the Doppelganger 1 from the exciting world of #Amigos 💥
Happy New Year ❤️
In cinemas on Feb 10, 2023 🔥@AshikaRanganath #RajendraReddy @GhibranOfficial @saregamasouth pic.twitter.com/d00fLAt6BJ
— Mythri Movie Makers (@MythriOfficial) January 1, 2023
