NKR 21: గతేడాది బింబిసార చొత్రంతో నందమూరి కళ్యాణ్ రామ్ దశ మారిపోయింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బింబిసార భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇదే జోష్ లో అమిగోస్ అనే ప్రయోగాత్మకమైన సినిమా చేసి బోల్తా పడ్డాడు కళ్యాణ్ రామ్. అయినా విజయాపజయాలను పట్టించుకోకుండా ముందుకు దూసుకెళ్తున్న కళ్యాణ్ రామ్.. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఇప్పటికే డెవిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ హీరో మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు కావడంతో NKR 21 ను మేకర్స్ ప్రకటించి విషెస్ చెప్పారు. అలా ఎలా అనే రొమాంటిక్ కామెడీ సినిమా ను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ అశోక క్రియేషన్స్, కళ్యాణ్ రామ్ యొక్క ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి.
Kajol: నేను అలా ఉంటాను అని నా పిల్లలే నా సినిమాలు చూడరు..
ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేసి కళ్యాణ్ రామ్ కు బర్త్ డే విశేష్ తెలిపారు. రక్తంతో తడిసిన కళ్యాణ్ రామ్ చేయిని చూపిస్తున్న పోస్టర్ ఆసక్తి రేపుతోంది. ఇక కళ్యాణ్ రామ్ ఫిల్మోగ్రఫీ లో అత్యంత భారీ ప్రాజెక్ట్ గా అంచనా వేయబడిన ఈ చిత్రం లో భారీ స్టార్ క్యాస్ట్ ను ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇద్దరు కీలక నటులు ఇందులో నటించనున్నారట. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.