Site icon NTV Telugu

కళ్యాణ్ దేవ్ షాకింగ్ ట్రాన్స్ఫార్మేషన్… పిక్ వైరల్

Kalyan-dev

మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ విడిపోయారని, ఈ జంట విడాకుల గురించి పుకార్లు పెరిగిపోయాయి. కొన్ని రోజుల క్రితం చిరు కూతురు శ్రీజ కళ్యాణ్ గా ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్ పేరును శ్రీజ కొణిదెలగా మార్చింది. ఆమె తన చిన్న కుమార్తె నవిష్క తండ్రి అయిన కళ్యాణ్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో అనుసరించడం మానేసింది.

Read Also : టీమ్ ఇండియా U19 స్కోర్‌ బోర్డ్‌ లో స్టార్ హీరో పేరు!!

దీంతో ఈ జంట విడిపోయారనే పుకార్లు బలంగా విన్పిస్తున్నాయి. ఈ రూమర్స్ పై అటు చిరు ఫ్యామిలీ, శ్రీజ గానీ… ఇటు కళ్యాణ్ దేవ్ గానీ స్పందించలేదు. గత కొన్ని రోజులుగా బయటకు వస్తున్న మెగా ఫ్యామిలీ పిక్స్ లో కూడా కళ్యాణ్ దేవ్ కనిపించకపోవడం విడాకుల వార్తలకు బలాన్ని చేకూర్చింది. ఈ బలమైన పుకార్ల మధ్య కళ్యాణ్ దేవ్ తన తదుపరి ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. తాజాగా బయటకు వచ్చిన పిక్ లో సరికొత్త బాడీ ట్రాన్స్ఫార్మేషన్ తో అందరికీ షాక్ ఇచ్చాడు. మెజారిటీ నెటిజన్లు జిమ్‌లో అతని ప్రయత్నాలను ప్రశంసించగా, కొంతమంది ఆయన పర్సనల్ లైఫ్ గురించి అడగడానికి ఆసక్తిగా ఉన్నారు.

ఈ పిక్ కు “మీరు ఇది చేయలేరు అని ఎవరైనా మీకు చెప్పినప్పుడు కేవలం నవ్వుతూ చూడమని వారికి చెప్పండి” అని కళ్యాణ్ స్ఫూర్తిదాయకమైన క్యాప్షన్‌ ఇచ్చాడు. జిమ్‌లో బ్లూ ట్యాంక్ టాప్‌లో కన్పిస్తున్న కళ్యాణ్ ప్రస్తుతం రమణ తేజ దర్శకత్వంలో వస్తున్న “కిన్నెరసాని”లో కనిపించనున్నాడు. దేశరాజ్ రచన అందించిన ఈ చిత్రాన్ని ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది.

Exit mobile version