Site icon NTV Telugu

Kalpika Ganesh : డిస్కౌంట్ అడగలేదు.. డిసర్ట్ అడిగితే గొడవ పడ్డారు.. కల్పిక క్లారిటీ..

Kalpika

Kalpika

Kalpika Ganesh : సినీ నటి కల్పిక గణేశ్ మరోసారి హాట్ టాపిక్ అవుతున్నారు. ఫ్రిజం పబ్ సిబ్బందితో ఆమె గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆమె ఎన్టీవీతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది. ఆ రోజు నా బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం గచ్చిబౌలిలోని ఫ్రిజం పబ్ కు వెళ్లాను. డిన్నర్ అయిపోయిన తర్వాత నా బర్త్ డేకు ఏదైనా డిసర్ట్ ఇవ్వమని అడిగాను. హైదరాబాద్ లో ఎక్కడైనా సరే బర్త్ డే ఉన్న వారికి కాంప్లిమెంటరీ కింద డిసర్ట్ ఇస్తారు. నేను అదే అడిగితే.. వారు సరిగ్గా స్పందించలేదు.

Read Also : Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?

మేనేజర్ ను పిలిచి కూడా రెండు సార్లు అడిగాను. దానికి వాళ్లు మా రూల్స్ లో లేదు. మీ బిల్ రూ.2వేలే అయింది కదా.. అది కూడా కట్టలేరా అంటూ దారుణంగా మాట్లాడారు. నేను కూడా వాళ్లతో వాదించాను. చివరకు ఒక బ్రౌనీ తీసుకొచ్చి టేబుల్ మీద విసిరేసినట్టు పెట్టారు. నాకు అది అస్సలు నచ్చలేదు. ఇలా విసిరేయడం మర్యాద కాదని అన్నాను. దానికి వాళ్లు ఇష్టం వచ్చినట్టు నన్ను తిట్టారు. బూతులు మాట్లాడారు. నా ప్రొటెక్షన్ కోసం నేను లైవ్ వీడియో చేశాను. ఎందుకంటే వాళ్లు 17 మంది ఉన్నారు.

నా మీద దాడి జరగొద్దనే ఉద్దేశంతోనే వీడియో తీశాను. నా చుట్టు పక్కల ఉన్న వారు త్వరగా రావాలని కోరాను. వాళ్లు మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడారు. ఒకరు ఏం మాట్లాడితే మిగతా అందరూ అలాగే మాట్లాడుతున్నారు. వాళ్లకు కనీసం మర్యాద కూడా లేదు. అందుకే నేను వాళ్లతో వాదించాల్సి వచ్చింది’ అంటూ తెలిపింది గణేశ్.

Read Also : Deepika Padukone: ‘స్పిరిట్’ కోసం తగ్గని దీపిక.. అల్లు అర్జున్ కోసం ఎందుకు తగ్గింది?

Exit mobile version