Site icon NTV Telugu

Kalki 2898 AD: విదేశాల్లో కూడా రికార్డులు తిరగరాస్తున్న “కల్కి 2898 ఏడీ”

Kalki

Kalki

Kalki 2898 AD Sets The New Record In Canada: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం “కల్కి 2898 AD” జూన్ 27 గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫస్ట్ షో నుంచి అన్నిచోట్ల ఫుల్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతన్న ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది. సైన్స్, ఫిక్షన్‌కు ముడిపెడితూ తీసిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో చూపిస్తూ ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. అటు విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రివ్యూస్ పొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగో రోజు రూ.500 కోట్ల క్లబ్‌లో చేరింది.. విడుదలైన తొలిరోజే 191.5 కోట్లు వసూలు చేసిన కల్కి ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా కల్కి రికార్డు క్రియేట్ చేసింది.

Also Read; Thangalaan: ఆగస్ట్ రేసులోకి మరో పాన్ ఇండియన్ మూవీ…

ఇక ఈ చిత్రం భారతదేశంలోనే కాదు అమెరికాలో కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. మొదటి వారాంతంలో ఉత్తర అమెరికాలో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా కల్కి నిలిచింది. ప్రత్యంగిరా సినిమాస్ ప్రకారం.. కల్కి చిత్రం మొదటి వారాంతంలో 11 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ. 91 కోట్లు) వసూల్ చేసింది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ మార్కును టచ్ చేయలేదు ఇది ఒక రికార్డు అయితే ఇప్పటివరకు కెనడా లో రిలీజ్ అయినా తెలుగు సినిమాలలో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా కల్కి చరిత్ర సృష్టించింది. ఇదే కొనసాగితే లాంగ్ రన్‌లో రూ.1000 కోట్ల దాటడంతో పాటు సరికొత్త రికార్డులు కల్కి సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Exit mobile version