NTV Telugu Site icon

Kalki2898AD: ఓరినాయనో.. త్రీడీ కళ్ల జోళ్ల తో నిర్మాతకు కోటి రూపాయలా..!

Kalki

Kalki

Kalki2898AD: రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సినిమా వారాంతంలో మంచి వసూళ్లు రాబట్టింది. అలానే జూలై 2 మంగళవారం కూడా ఈ సినిమా తన జోరును కొనసాగించింది. ఆరో రోజు ఈ సినిమా ఇండియాలో రూ.27.85 కోట్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ఆరు రోజులు కలిపి ఇండియాలో రూ.371 కోట్లకు చేరాయి. ఆరో రోజు తెలుగులో రూ.11.2 కోట్లు, హిందీలో రూ.14 కోట్లు, తమిళంలో రూ.1.4 కోట్లు, మలయాళంలో రూ.1.2 కోట్లు, కన్నడలో రూ.0.25 కోట్లు వసూలు చేసింది. ఒక్క తెలుగులోనే ఆరు రోజులు కలిపి సుమారు రూ.200 కోట్ల వరకు రావడం విశేషం. . వారం రోజుల్లో రికార్డ్ స్థాయిలో కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా మొత్తం రూ. 635 కోట్ల రూపాయలు వసూల్ చేసింది.

Also Read:Mrunal Thakur: బాలీవుడ్‌లో జాక్‌పాట్ కొట్టిన సీత

ఇదే ఫ్లో కంటిన్యూ చేస్తే ఈజీగా 1000 కోట్ల వరకు చేరుకుంటుందని ట్రేడ్ వారాగాలు అంచనాలు వేస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఉత్తర అమెరికాలో $12 మిలియన్లను అధిగమించింది. అక్కడ అత్యంత వేగంగా 100 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసిన భారతీయ సినిమాగా కల్కి రికార్డు సృష్టించింది. ఇక నైజాం లో కూడా ప్రభాస్ రాంపేజ్ ఇప్పుడు అప్పుడే తగ్గేలా కనిపించడం లేదు. ప్రత్యకంగా నైజాం ఏరియాలోనే 100కోట్లు మార్క్ కి దగ్గరలో ఉంది. అంతేకాకుండా నైజాంలోనే కేవలం త్రీడీ కళ్లజోళ్ల అమౌంట్ నే నిర్మాతకు కోటి రూపాయలకు పైగా వసూళ్లు వచ్చాయంటే కల్కి ప్రభంజనం ఎలాంటిదో అర్ధం అయ్యిపోతుంది. హిందూ పురాణాలకు సైన్స్ ఫిక్షన్ ను జోడించి తీసిన ఈ సినిమాను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఇంకా పోను పోను ఎలాంటి రికార్డులు తిరగ రాస్తుందో వచ్చి చుడాలిసిందే.

Show comments