Site icon NTV Telugu

Kalki 2898AD: భైరవగా ప్రభాస్.. అదిరిపోయిన కల్కి పోస్టర్

Bannu

Bannu

Kalki 2898AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో కల్కి 2898ఏడి ఒకటి. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మొత్తం నాగ్ అశ్విన్ స్టార్ క్యాస్టింగ్ తో నింపేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. కమల్ హాసన్ విలన్ గా నటిస్తున్నాడు. వీరే కాకుండా అమితాబచ్చన్, దిశా పటాని కీలకపాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గత రెండు రోజుల క్రితం సాంగ్ షూట్ కోసం చిత్ర బృందం ఇటలీకి వెళ్లిన విషయం తెల్సిందే. ఈ సినిమాపై అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించనున్నాడని సమాచారం.

ఇక నేడు మహా శివరాత్రి సందర్భంగా మేకర్స్ ఒక మంచి అప్డేట్ ను అభిమానులకు అందించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర పేరును ఎట్టకేలకు రివీల్ చేశారు. భైరవ అనే పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్లు తెలిపారు.ఇక పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. స్టైలిష్ లుక్ లో ప్రభాస్ కనిపించాడు. గాగుల్స్, స్లీవ్ లెస్ డ్రెస్ .. కండలు తిరిగిన దేహంపై టాటూ, పోనీటైల్ హెయిర్.. వేరే లెవల్ ల్లో ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version