Site icon NTV Telugu

Kalki 2898 AD : ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ కు ‘కల్కి’ నామినేట్..

Kalki 2

Kalki 2

Kalki 2898 AD : ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. తాజాగా ప్రతిష్టాత్మక ఇండియన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న తెలుగు సినిమాగా రికార్డు సృష్టించింది. ఉత్తమ సినిమా విభాగంలో తెలుగు నుంచి నామినేట్ అయిన ఏకైక మూవీ ఇది. కల్కితో పాటు ఇదే అవార్డు కోసం హోమ్‌బౌండ్, ఎల్‌2 ఎంపురాన్, మహారాజ్, స్త్రీ-2, సూపర్‌బాయ్స్‌ ఆఫ్ మాలేగావ్‌ సినిమాలు కూడా పోటీ పడుతున్నాయి. కానీ వాటన్నింటికంటే కల్కి సినిమాకే చాలా ఎక్కువ అకవాశాలు ఉన్నాయి. ఆ సినిమాలు వచ్చిన జోనర్ వేరు.

Read Also : Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్

కల్కి వచ్చిన జోనర్ వేరు. ఈ లెక్కన కల్కి అవార్డు సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదని అంటున్నారు ట్రేడ్ నిపుణులు. ఇక ఉత్తమ నటుడు అవార్డు కోసం మోహన్ లాల్(ఎల్‌2 ఎంపురాన్‌), అభిషేక్‌ బచ్చన్‌ (ఐ వాంట్‌ టు టాక్‌), ఇషాన్‌ ఖట్టర్‌ (హోమ్‌బౌండ్‌), విశాల్‌ జెత్వా (హోమ్‌బౌండ్‌), జునైద్‌ ఖాన్‌ (మహారాజ్‌), ఆదర్శ్‌ గౌరవ్‌ (సూపర్‌బాయ్స్‌ ఆఫ్‌ మాలేగావ్‌) పోటీలో ఉన్నారు. వీరిలో మన తెలుగు నుంచి ఎవరూ నామినేషన్స్ లో లేరు. ఇక ఉత్తమ నటి విభాగంలో కూడా తెలుగు సినిమా లేదు.

Read Also : Kriti Sanon : బాయ్ ఫ్రెండ్ తో ప్రభాస్ హీరోయిన్.. లండన్ లో చెక్కర్లు

Exit mobile version