NTV Telugu Site icon

Kalki 2898 AD: ప్రసాద్ ఐమాక్స్ లో 18 రోజులకు 4.8 కోట్లు!!

Kalki 2898 AD: ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 28988 సినిమా గత నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. హాలీవుడ్ సినిమాలకు ధీటుగా ఈ సినిమా ఉందని చూసిన వాళ్ళందరూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయి మూడు వారాలు గడుస్తున్నా ఇప్పటికీ హౌస్ ఫుల్ షోస్ నడుస్తూనే ఉన్నాయి. ఇక ఈ సినిమా మొదలుపెట్టిన తర్వాత అపర్ణ సినిమాస్ మల్టీప్లెక్స్ ఏకంగా కోటి రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయగా ఇప్పుడు మరొక మల్టీప్లెక్స్ తాము ఈ సినిమా ద్వారా నాలుగు కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు వెల్లడించింది.

Also Read: Instagram Reels: హర్భజన్ సింగ్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్లపై కేసు నమోదు.. కారణమిదే..?

ఆ మల్టీప్లెక్స్ మరేమిటో కాదు ప్రసాద్ ఐమాక్స్ గా హైదరాబాద్ ప్రజలందరూ పిలుచుకునే ప్రసాద్ మల్టీప్లెక్స్. ఒకప్పుడు ఈ మల్టీప్లెక్స్ లో ఐమాక్స్ స్క్రీన్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు దాన్ని తొలగించారు కాబట్టి ప్రసాద్ మల్టీప్లెక్స్ అని పిలుస్తున్నారు. కానీ ప్రజలు ఇప్పటికీ దాన్ని ఐమాక్స్ అనే పిలుస్తూ ఉంటారు. ఇక ఈ సినిమా ఈ థియేటర్లో 18 రోజులకు గాను నాలుగు కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 18 రోజులకు గాను 400 షూస్ వేయగా మాదాపూర్ 1,20,000 మంది ఈ మల్టీప్లెక్స్ లో కల్కి సినిమాను వీక్షించినట్లు అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే 1000 కోట్లు కలెక్షన్లు రాబట్టగా 1100 కోట్లు కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతోంది.

Show comments