Site icon NTV Telugu

Kalasa Trailer: ఆసక్తి రేపుతున్న కలశ మూవీ ట్రైలర్

Kalasa Trailer

Kalasa Trailer

Kalasa Movie Trailer Released: చంద్రజ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్ కీలక పాత్రల్లో నటించిన కలశ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. కొండా రాంబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను చిత్రాన్ని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజ వాడపల్లి నిర్మించగా ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి సినిమా పై మరింత అంచనాలను పెంచింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ ఆవిష్కరించి చిత్ర యూనిట్ కి కంగ్రాట్స్ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు మలినేని గోపీచంద్ మాట్లాడుతూ కలశ మూవీ ట్రైలర్ చాలా బాగుంది, ఈ సినిమా థ్రిల్లరా? లేక హర్రరా ? అనేది తెలియకుండా తెలివిగా కట్ చేశారు. ‘

Adudam Andhra: క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్.. 9 సంస్థలతో ఏపీ సర్కార్‌ ఒప్పందాలు

కలశ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టి డైరెక్ట్ చేసిన దర్శకుడు రాంబాబుకి అల్ ది బెస్ట్, ఈ సినిమా డిసెంబర్ 15 న రిలీజ్ అవుతుంది తప్పకుండా చూడండని అన్నారు. ఇక హీరోయిన్ భానుశ్రీ మాట్లాడుతూ డిసెంబర్ 15 మా కలశ రిలీజ్ అవుతుంది, మీ బ్లెస్సింగ్స్ కావాలి అని అన్నారు. హీరోయిన్ సోనాక్షి వర్మ మాట్లాడుతూ కలశ మూవీ ట్రైలర్ ను డైరెక్టర్ మలినేని గోపీచంద్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది, డిసెంబర్ 15న రిలీజ్ అవుతున్న కలశ సినిమాను ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించండని అన్నారు. భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌, రోషిణి కామిశెట్టి, జీవా, సమీర్‌, రవివర్మ తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ వెంకట్‌ గంగధారి, సంగీతం విజయ్‌ కురాకుల అందించారు.

Exit mobile version