Site icon NTV Telugu

Kajal Aggarwal: ఇండస్ట్రీకి బ్రేక్.. ఇచ్చిపడేసిన చందమామ..?

Kajal

Kajal

Kajal Aggarwal: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తుందని, సినిమాలకు గుడ్ బై చెప్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ సినిమాలకు గుడ్ బై చెప్తుంది అనేసరికి అభిమానులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే దానికి కారణంగా కాజల్ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యినట్లు చెప్పుకొస్తున్నారు. తాజాగా ఈ రూమర్స్ కు కాజల్ స్పందించింది. తాజాగా ఆమె సత్యభామ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమా టైటిల్ లాంచ్ లో కాజల్ మాట్లాడుతూ.. ” ఈ సినిమా టైటిల్ ను లాంచ్ చేయడానికి వచ్చిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల గారికి థాంక్స్. మీ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం . మీ సినిమాల్లో హీరోయిన్ ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం. ఇక ఈ సినిమాకు నన్ను ఎన్నుకున్నందుకు చిత్ర బృందానికి థాంక్స్. ఇక అభిమానులు, మీడియా.. మీరు లేకపోతే కచ్చితంగా నేను లేను. మీ ఎంకరేజ్ మెంట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.

Rakesh Master: నేను చనిపోతానని ముందే తెలుసు.. కన్నీరు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ చివరి మాటలు

తెలుగు సినిమా నాకు హోమ్ ల్యాండ్ లాంటింది. తెలుగు అభిమానులు నిజంగా చాలా గొప్పవారు. మీ వలనే నేను ఇక్కడ ఉన్నాను. ఈ సినిమాను మీరు ఆదరిస్తారు అనుకుంటున్నాను. ముందు ముందు కూడా మీ ఆదరణ మాపై ఉండాలని కోరుకుంటున్నాను. మీ వైబ్ ను నేనెప్పుడూ నాతోపాటే ఉంచుకుంటాను” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలతో కాజల్.. సినిమాలకు గుడ్ బై చెప్తుంది అన్న మాటలకు చెక్ పడినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాతో పాటు.. కాజల్.. ప్రస్తుతం బాలయ్య సరసన భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాలతో కాజల్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version