Site icon NTV Telugu

Kajal Aggarwal: బాలీవుడ్ లో నీతి, విలువలు లేవు.. కాజల్ సంచలన వ్యాఖ్యలు

Kajal

Kajal

Kajal Aggarwal: టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ కుర్రకారు గుండెల్లో నిలిచిపోయిన ఈ ముద్దుగుమ్మ చందమామ సినిమాతో టాలీవుడ్ చందమామగా మారిపోయింది. స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన కాజల్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని వివాహమాడి షాక్ ఇచ్చింది. ఇక పెళ్ళైన ఏడాదికే ఒక బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. ప్రస్తుతం ఒకపక్క మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తూనే ఇంకోపక్క మళ్లీ తన కెరీర్ ను మొదలుపెట్టడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం కాజల్ చేతిలో రెండు పెద్ద చిత్రాలు ఉన్నాయి. కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 లో, బాలకృష్ణ సరసన NBK108 లో నటిస్తోంది. ఇక తాజాగా కాజల్.. సౌత్ సినీ ఇండస్ట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసి షాక్ ఇచ్చింది.

Sai Dharam Tej: ఆ ఒక్కటి మిగిలింది… కానీ అంతా అయిపొయింది…

రైజింగ్ ఇండియా సమిట్ 2023 లో పాల్గొన్న కాజల్ మాట్లాడుతూ.. ” నేను పుట్టి పెరిగింది ముంబైలో అయినా.. నేను కెరీర్ స్టార్ట్ చేసింది హైదరాబాద్ లోనే. సౌత్ సినిమాలతోనే నేను స్టార్ హీరోయిన్ గా మారాను. తెలుగు, తమిళ్ భాషల్లో చేయడం వలన.. హైదరాబాద్, చెన్నెలతో నాకు ప్రత్యేకం అభిమానం ఉంది. సౌత్ సినిమాల్లో స్నేహపూర్వక వాతావరణం ఎక్కువగా ఉంటుంది. సౌత్ ఆడియెన్స్.. ట్యాలెంట్ ఉంటే ఎవరినైనా ఆదరిస్తారు. తెలుగులో హీరోయిన్ పాత్రలకు ఎక్కువ గుర్తింపు లభిస్తుంది. బాలీవుడ్ లో అలా కాదు. కొన్ని మంచి సినిమాల్లో నటించినా.. సౌత్ ఉన్నట్లు నీతి, నైతిక విలువలు బాలీవుడ్ లో లోపించాయి. బాలీవుడ్ సినిమాలు అంటే నాకు కూడా గౌరవమే..” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version