Site icon NTV Telugu

Kajal Aggarwal : ‘సత్యభామ’నే అంటున్న కాజల్.. రక్తం కళ్లజూసిందిగా!

Satyabhama Glimpse

Satyabhama Glimpse

Kajal Aggarwal Satyabhama Title Glimpse: లక్ష్మీ కళ్యాణం సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్ అగర్వాల్. ఇక ఆ తరువాత తెలుగులో వరస సినిమాలు చేస్తూ తమిళ, హిందీ భాషల్లో కూడా వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా ఇండియా వైడ్ గా సూపర్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న కాజల్‌ అగర్వాల్‌ కాస్త సినిమా అవకాశాలు తగ్గడంతో సైలెంటుగా ప్రేమించిన గౌతం కిచ్లూని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి చేసుకున్న తరువాత బాబుకు కూడా జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ లోనూ సినిమాల విషయంలో ఏ మాత్రం తగ్గేదేలే అంటోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న కాజల్‌ ఈ ఏడాది ఘోస్టీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకుగా వచ్చింది.
Rana Daggubati: పాన్ ఇండియా సినిమాలో రానా.. సైలెంట్ గా కానిచ్చేశారు!
ఇక ఇప్పుడు కాజల్‌ కొత్త సినిమాకు సంబంధించిన అప్‌డేట్ వచ్చేసింది. Kajal60 టైటిల్ గ్లింప్స్ వీడియోను సాయంత్రం 6:39 గంటలకు బంజారాహిల్స్ లోని ఆర్‌కే సినీ ప్లెక్స్‌లో లాంఛ్ చేసింది సినిమా యూనిట్. ఇక ఈ టైటిల్ గ్లింప్స్ వీడియో పరిశీలిస్తే కాజల్‌ ఈ సారి ఫీ మేల్ ఓరియెంటెడ్‌ సబ్జెక్టుతో వస్తున్నట్టు క్లారిటీ వచ్చేస్తోంది. ఈ సినిమాలో ఆమె మాదాపూర్ ఏసీపీ సత్యభామగా ఒక పవర్ ఫుల్ పోలీస్ అధికారిణిగా కనిపిస్తోంది. రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్ వీడియో సినిమా మీద ఆసక్తి ఏర్పరుస్తోంది. మేజర్, గూడచారి సినిమాల డైరెక్టర్ శశికిరణ్ తిక్క ఈ సినిమాను సమర్పిస్తుండగా ఆయన సోదరుడు బాబీ తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ దేగల డైరెక్టర్ గా పరిచయం అవుతూ ఉండగా శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లె అందిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు కోదాటి పవన్ కళ్యాణ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. YouTube video player

Exit mobile version