సోషల్ మీడియాలో సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఒక వార్త వైరల్ అయింది.. “కాజల్ అగర్వాల్ యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డారు, పరిస్థితి విషమంగా ఉంది” అని. ఈ వార్తలు అభిమానుల్లో ఆందోళన కలిగించాయి. చాలామంది ఆమెను ట్యాగ్ చేస్తూ ఆరోగ్యంపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో కాజల్ స్వయంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా తప్పుడు రూమర్స్ మాత్రమేనని, తాను సురక్షితంగానే ఉన్నానని స్పష్టం చేశారు.
Also Read : Puri & Sethupathi : ప్రత్యేక ఎంట్రీ సీక్వెన్స్ కోసం పూరి స్పెషల్ ప్రిపరేషన్
“నేను ప్రమాదంలో పడ్డానని, ఇక లేదన్నట్టుగా వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి. నిజం చెప్పాలంటే వాటిని చదివి నేను నవ్వుకున్నాను. ఇంతకంటే ఫన్నీ న్యూస్ ఉండదు. ఇవన్నీ అవాస్తవం మాత్రమే. దేవుడి దయవల్ల నేను క్షేమంగా ఉన్నాను. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దు, షేర్ చేయవద్దు. బదులుగా నిజమైన విషయాలు పంచుకోండి” అని కాజల్ ఒక నోట్ విడుదల చేశారు.ఈ క్లారిఫికేషన్‌తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, కాజల్ ఇటీవల మంచు విష్ణు నటించిన ‘కన్నప్ప’ సినిమాలో పార్వతీ దేవి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆమె కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఇండియన్ 3’లో నటిస్తున్నారు. అదేవిధంగా, ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ **‘రామాయణ’**లోనూ కాజల్ కీలక పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
