Site icon NTV Telugu

Kajal Aggarwal: అది చేయనంటున్న కాజల్.. అయితే కష్టమే అంటున్న ఫ్యాన్స్

Kajl

Kajl

Kajal Aggarwal: అందాల చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను అలరించిన కాజల్.. టాలీవుడ్ లో స్టార్ హీరోలు అందరు సరసన నటించి మెప్పించింది. ఇక కెరీర్ పిక్స్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహమాడి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. ఇక పెళ్లి తర్వాత కూడా ఆమె నటిస్తుంది అనుకున్న సమయంలో తాను ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లయిన రెండేళ్లకే బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా మారింది. ఇక కాజల్ సినిమాలకు గ్యాప్ ఇస్తుందని, కుటుంబ బాధ్యతను స్వీకరిస్తుందని ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటూ కాజల్ రీ ఎంట్రీ ఇచ్చింది. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి చిత్రంలో బాలయ్య సరసన నటించే ఛాన్స్ ను పట్టేసింది.

Allu Arjun: అప్పుడు వీడేం హీరో అన్నారు.. ఇప్పుడు వీడురా హీరో అంటున్నారు

ఇక దీంతో అమ్మడికి ఎలాంటి ఇబ్బంది లేదని, రీ ఎంట్రీలో ఈ సినిమా హిట్టు కొడితే వరుస అవకాశాలు తన్నుకు వస్తాయని అభిమానులు అనుకున్నారు. అయితే ఇప్పుడు కాజల్ తీసుకున్న నిర్ణయం వలన అది సాధ్యం కాదేమో అనిపిస్తుందని నెటిజన్స్ అంటున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ గ్లామర్ షోకు నో చెప్తుంది అంట. అంతకుముందులాగా హీరోల సరసన స్కిన్ షో చేయను అని ఖరాకండీగా చెప్తుందంట. దీనివలనే స్టార్ హీరోల సరసన వచ్చిన రెండో అవకాశాలు పోయాయని తెలుస్తుంది. తల్లి అయ్యాక సినిమాలు చేయాలంటే స్కిన్ షో చేయకూడదని గౌతమ్ చెప్పినట్లు తెలుస్తుంది. అందుకే కాజల్ స్కిన్ షో ఉండని సినిమాలు మాత్రమే ఒప్పుకుంటుందని సమాచారం. దీంతో అభిమానులు ఇలా అయితే కాజల్ ముందు ముందు అవకాశాలు అందుకోవడం కష్టమే అని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇకపోతే కాజల్ చేతిలో సత్యభామ తో పాటు మరో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఈ సినిమాలు కాజల్ ఎలాంటి రిజల్ట్ ను అందిస్తాయో చూడాలి.

Exit mobile version