NTV Telugu Site icon

Kajal Aggarwal: ఆ హీరోయిన్ కు తల్లిగా కాజల్.. ఛఛ నిజమై ఉండదులే..?

Kajal

Kajal

Kajal Aggarwal: చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం రీ ఎంట్రీ ఇవ్వడానికి బాగా ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. బాబు పుట్టిన తరువాత కొద్దిగా బొద్దుగా మారిన కాజల్ ప్రస్తుతం మునుపటి రూపానికి రావడానికి కష్టపడుతోంది. ఇక ఈ మధ్యనే అమ్మడు కోలీవుడ్ లో వెబ్ సిరీస్ ద్వారా ఎంట్రీ ఇస్తోంది. ఘోస్టీ అనే పెడుతూ తెరకెక్కిన ఈ సిరీస్ లో కాజల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ టాలీవుడ్ రీ ఎంట్రీ.. గ్రాండ్ గా ప్లాన్ చేస్తోందట. మొట్టమొదటిసారి బాలకృష్ణ సరసన నటించడానికి కాజల్ ఓకే చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే. ఇందులో కుర్ర హీరోయిన్ శ్రీలీల.. బాలయ్యకు కూతురిగా నటిస్తోంది. అయితే శ్రీలీల తల్లిగా కాజల్ నటించనుందట.

నిజం చెప్పాలంటే.. బాలయ్య సరసన నటించే అవకాశం కాజల్ కు రెండు సార్లు వచ్చింది. కానీ, ఆమె ఆ రెండు ఛాన్స్ లను వదులుకుంది. ఇక ఈ సినిమా రీ ఎంట్రీ కావడం.. అందులోనూ హిట్ కాంబో బాలయ్య – అనిల్ రావిపూడి కావడంతో మంచి కమ్ బ్యాక్ అవుతుందని నమ్మి అమ్మడు ఓకే చెప్పేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్త వినడంతోనే కాజల్ ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఏమంత వయస్సు అయిపోయిందని ఇంకో హీరోయిన్ కు తల్లిగా చేస్తున్నావ్ కాజల్.. అని భాదను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే.. కాజల్ కు పేరు వస్తుందో లేదో తెలియదు కానీ, ముందు ముందు మాత్రం ఇలాంటి పాత్రలే వస్తాయి అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

Show comments