త్వరలో తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్ తాజాగా దుబాయ్ లో కన్పించింది. అయితే ఆమె దుబాయ్ కి వెకేషన్ కోసం కాదు స్పెషల్ రీజన్ కోసమే వెళ్ళింది. ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ యూఏఈ వీసాను అందుకున్న సెలబ్రిటీల జాబితాలో తాజాగా కాజల్ అగర్వాల్ కూడా చేరారు. కాజల్ తన సోషల్ మీడియా ద్వారా వీసా అందుకున్న ఫోటోను షేర్ చేసింది. “యూఏఈ గోల్డెన్ వీసా లభించినందుకు సంతోషంగా ఉంది. మాలాంటి కళాకారులకు ఈ దేశం ఎప్పుడూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోంది. కృతజ్ఞతలు… యూఏఈ లో భవిష్యత్ సహకారాల కోసం ఎదురు చూస్తున్నాను. జుమా అల్మ్‌హీరీకి చెందిన ముహమ్మద్ షానిద్, సురేష్ పున్నస్సేరిల్, నరేష్ కృష్ణలకు ధన్యవాదాలు” అని కాజల్ అగర్వాల్ ట్వీట్ చేసింది.
Read Also : “NTR30″ని కన్ఫర్మ్ చేసిన బాలీవుడ్ భామ
కాజల్ కంటే ముందే త్రిష కూడా గోల్డెన్ వీసా అందుకుంది. ఫరా ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమల్ మాలిక్, మోహన్‌లాల్, దుల్కర్ సల్మాన్, త్రిషా కృష్ణన్, మమ్ముట్టి గతంలో యూఏఈ గోల్డెన్ వీసాను అందుకున్నారు. పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు, ప్రత్యేక ప్రతిభావంతులు, సైన్స్ అండ్ నాలెడ్జ్, వివిధ రంగాలలో పరిశోధకులు, ట్యాలెంటెడ్ స్టూడెంట్స్ యూఏఈ ప్రభుత్వం నుండి ఈ వీసాను పొందొచ్చు.
ఇక కాజల్ ప్రస్తుతం ‘ఆచార్య’ విడుదల కోసం వేచి ఉంది. ఆమె తమిళ చిత్రం ‘హే సినామిక’, హిందీ చిత్రం ‘ఉమా’ కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. కాజల్ ప్రస్తుతం ప్రెగ్నెన్సీ పీరియడ్‌ని ఎంజాయ్ చేస్తోంది.