అందాల చందమామ కాజల్ అగర్వాల్ పెళ్ళైనప్పటికీ సినిమాల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చిరంజీవితో ఆచార్య, నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న “ఘోస్ట్” సినిమాలతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో కాజల్ తల్లి కాబోతోందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజా సమాచారమే ప్రకారం ఆ రూమర్స్ నిజం అయ్యేలా కన్పిస్తున్నాయి.
Read Also : “ఆచార్య” షూటింగ్ సెట్ కు చిరు, చరణ్
2020 అక్టోబర్ 30న కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లును అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య వివాహం చేసుకుంది. ఆ తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండా భర్తతో పాటే షూటింగులకు కూడా వచ్చేసింది. ఇప్పుడైతే కాజల్ కొంతకాలం ఎలాంటి కొత్త ప్రాజెక్ట్‌లపై సంతకం చేసే ఆలోచనలో లేదని తెలుస్తోంది. అక్టోబర్ 30న తన మొదటి వివాహ వార్షికోత్సవం రావడానికి ముందు ఆమె సినిమాల నుండి కొంత విరామం తీసుకోవాలనుకుంటుందని సినిమా వర్గాలు అంటున్నాయి. ఇటీవలే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా తన అక్క తల్లి కావాలని కోరుకుంది. మరోవైపు రూమర్స్ పై కాజల్ ఇంకా స్పందించలేదు. అయితే తాజా సమాచారం మేరకు కాజల్, గౌతమ్ త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయంపై వారి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
