Site icon NTV Telugu

Pavala Shyamala: కాళ్లు చచ్చుబడిపోయి.. బెడ్ పై లేవలేని స్థితిలో లేడీ కమెడియన్..

Pawala

Pawala

Pavala Shyamala: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ విజయాలు ఉన్నంతవరకే గుర్తింపు వస్తుంది. ఒక్కసారి దాన్ని నుంచి బయటకు వస్తే పట్టించుకొనేవారు ఉండరు. ఇక సీనియర్ నటీనటుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది సీనియర్ నటులు బతికి ఉండగానే చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని యూట్యూబ్ ఛానెల్స్. ఇక గత కొన్నిరోజుల క్రితం టాలీవుడ్ లేడీ కమెడియన్ పావలా శ్యామల చనిపోయినట్లు కూడా రాసుకొచ్చారు. అయితే ఆమె చనిపోలేదు కానీ, దీనస్థితిలో ఉంది. నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆంధ్రావాలా, గోలీమార్ లాంటి సినిమాలో ఆమె కామెడీ.. ఇప్పటికీ మీమ్స్ రూపంలో దర్శనమిస్తూనే ఉంటాయి. ఇక గత కొన్నేళ్లుగా పావలా శ్యామల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్య అనారోగ్యం ఎక్కువ కావడంతో ఆమె బెడ్ కే అంకితమయ్యారు.

చేతిలో డబ్బులు లేక, పట్టించుకొనేవారు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇక తాజాగా నటుడు కాదంబరి కిరణ్.. పావలా శ్యామల పరిస్థితి తెలుసుకొని ఆమెకు ఆర్థిక సాయం చేశాడు. కాదంబరి కిరణ్ మనం సైతం ఫౌండేషన్ ను నడుపుతున్న విషయం తెల్సిందే. రూ. 25,000 చెక్కును ఆమెకు అందించి.. మెరుగైన వైద్యసేవలను అందజేశాడు. ఇక పావలా శ్యామల మాట్లాడుతూ .. ” నేను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. హార్ట్ లో మూడు హొల్స్ ఉన్నాయని చెప్పారు. కిడ్నీలు కూడా పాడయ్యాయని అన్నారు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. కాళ్లు ఎప్పుడో చచ్చుబడిపోయాయి. ఇండస్ట్రీలో నేను ఉన్నానో, పోయానో పట్టించుకొనేవారు లేరు. చాలామంది నేను చనిపోయాను అని రాస్తున్నారు. ఇక నా పరిస్థితి గురించి నేను ఎవరికి చెప్పలేదు.. నా దగ్గర ఎవరి ఫోన్ నెంబర్లు లేవు. ఎవరు పట్టించుకోకపోతే ఏం చేస్తాం.. ఆత్మహత్య చేసుకుంటాం.. ఎవరో ఒకరు ఒక పదివేలు ఇస్తే పూట గడుస్తుంది. ఈ జబ్బు నుంచి బయటపడాలి.. ఆదుకోండి” అని ఆమె కంటనీరు పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version