Kabzaa Teaser: కేజీఎఫ్ వైబ్స్ తీసుకొచ్చిన కబ్జా.. టీజర్ అదిరింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kabzaa Movie Teaser Released: కేజీఎఫ్ పుణ్యమా అని కన్నడ సినీ పరిశ్రమ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు.. ఒక చిన్న ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ లాంటి సంచలనం రావడంతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. కన్నడ ఇండస్ట్రీవైపు దృష్టి సారించింది. దీంతో, శాండిల్‌వుడ్ మేకర్స్ ఉన్నతమైన సినిమాలను తెరకెక్కించడంలోనే ప్రత్యేక దృష్టి పెట్టారు. కన్నడ హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటేందుకు, చాలా జాగ్రత్తగా తమ సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సినిమాల్లో నుంచి ‘కబ్జా’ ఒకటి. రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా టీజర్ విడుదల అయ్యింది. రానా దగ్గుబాటి ఈరోజు సాయంత్రం ఈ టీజర్‌ని రిలీజ్ చేశారు.
1942 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌తో స్పష్టమైంది. ఈ టీజర్ దాదాపు కేజీఎఫ్‌నే గుర్తు చేస్తోంది. ప్రతీ సీను, ప్రతీ షాటు.. ఆ సినిమానే తలపిస్తోంది. చూస్తుంటే.. ఈ సినిమా దర్శకుడు ఆర్. చంద్రు ‘కేజీఎఫ్’ సినిమా నుంచి బాగా స్ఫూర్తి పొందినట్టు ఉన్నాడు. అయితే.. విజువల్స్ మాత్రం అదిరిపోయింది. చాలా గ్రాండ్ స్కేల్‌లోనే, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తీసినట్టు కనిపిస్తోంది. 1942లో ఒక ఇండియన్ గ్యాంగ్‌స్టర్ ప్రయాణం ఎలా సాగిందన్న పాయింట్ చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ఎంట్రీలు అదిరాయి. చివర్లో శ్రియా శరణ్ తళుక్కుమని మెరిసింది. ఓవరాల్‌గా టీజర్ చాలా బాగుంది. మరి, కేజీఎఫ్ తరహాలోనే ఇది కూడా సంచలనాలను సృష్టిస్తుందో లేదో చూడాలి.
Also Read
- Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
- Peddi Pre Release Event: నేను పుట్టింది ఎంత నిజమో.. 'పెద్ది' ఇండస్ట్రీని షేక్ చేయడం అంతే నిజం: జగపతి బాబు
- Priyanka Mohan: గ్లోబల్ లెవెల్‌లో పవన్ కళ్యాణ్ బ్యూటీ రచ్చ.. కొరియా పర్యాటక రంగానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రియాంక మోహన్!
- Suriya48 లోడింగ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ లైనప్!
తాజావార్తలు
-
Janhvi Kapoor: ముద్దుముద్దు తెలుగుతో మురిపించిన జాన్వీ కపూర్.. ఫిదా అయిన చరణ్!
-
Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్‌న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
-
Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
-
Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
-
Chairman’s Desk: మోడీ నాలుగోసారి ప్రధాని అవుతారా? బీజేపీకి మళ్లీ అధికారం దక్కుతుందా?
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్‌తో గుడ్‌బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!