NTV Telugu Site icon

Kabzaa Teaser: కేజీఎఫ్ వైబ్స్ తీసుకొచ్చిన కబ్జా.. టీజర్ అదిరింది

Maxresdefault

Maxresdefault

Kabzaa Movie Teaser Released: కేజీఎఫ్ పుణ్యమా అని కన్నడ సినీ పరిశ్రమ తలరాత ఒక్కసారిగా మారిపోయింది. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టు.. ఒక చిన్న ఇండస్ట్రీ నుంచి కేజీఎఫ్ లాంటి సంచలనం రావడంతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది. కన్నడ ఇండస్ట్రీవైపు దృష్టి సారించింది. దీంతో, శాండిల్‌వుడ్ మేకర్స్ ఉన్నతమైన సినిమాలను తెరకెక్కించడంలోనే ప్రత్యేక దృష్టి పెట్టారు. కన్నడ హీరోలు సైతం పాన్ ఇండియా లెవెల్‌లో సత్తా చాటేందుకు, చాలా జాగ్రత్తగా తమ సినిమాల్ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఆ సినిమాల్లో నుంచి ‘కబ్జా’ ఒకటి. రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్ కలిసి నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించి తాజాగా టీజర్ విడుదల అయ్యింది. రానా దగ్గుబాటి ఈరోజు సాయంత్రం ఈ టీజర్‌ని రిలీజ్ చేశారు.

1942 బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రూపొందుతున్నట్టు టీజర్‌తో స్పష్టమైంది. ఈ టీజర్ దాదాపు కేజీఎఫ్‌నే గుర్తు చేస్తోంది. ప్రతీ సీను, ప్రతీ షాటు.. ఆ సినిమానే తలపిస్తోంది. చూస్తుంటే.. ఈ సినిమా దర్శకుడు ఆర్. చంద్రు ‘కేజీఎఫ్’ సినిమా నుంచి బాగా స్ఫూర్తి పొందినట్టు ఉన్నాడు. అయితే.. విజువల్స్ మాత్రం అదిరిపోయింది. చాలా గ్రాండ్ స్కేల్‌లోనే, భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని తీసినట్టు కనిపిస్తోంది. 1942లో ఒక ఇండియన్ గ్యాంగ్‌స్టర్ ప్రయాణం ఎలా సాగిందన్న పాయింట్ చుట్టూ ఈ సినిమా కథ అల్లుకుని ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఉపేంద్ర, కిచ్చా సుదీప్ ఎంట్రీలు అదిరాయి. చివర్లో శ్రియా శరణ్ తళుక్కుమని మెరిసింది. ఓవరాల్‌గా టీజర్ చాలా బాగుంది. మరి, కేజీఎఫ్ తరహాలోనే ఇది కూడా సంచలనాలను సృష్టిస్తుందో లేదో చూడాలి.