Site icon NTV Telugu

సీటిమార్ : ‘కబడ్డీ యాంతెమ్’ వీడియో సాంగ్

Kabaddi Anthem Video Song from Seetimaarr

మాచో హీరో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం “సీటిమార్”. థియేటర్లు రీఓపెన్ అయ్యాక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మొదటి సినిమా ఇదే. కబడ్డీ నేపథ్యలో రూపొందిన ఈ యాక్షన్ డ్రామాలో గోపీచంద్, తమన్నా ఇద్దరూ వరుసగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళా కబడ్డీ జట్లకు కోచ్‌లుగా నటించారు.

సంపత్ నంది దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఇందులో దిగంగన సూర్యవంశీ, భూమిక చావ్లా, తరుణ్ అరోరా, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి మరియు తనికెళ్ల భరణి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈ సినిమా. తాజాగా ఈ సినిమా నుంచి ‘కబడ్డీ యాంతెమ్’ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు.

Read Also : ఆయన సమున్నత శిఖరం… శ్రీశ్రీపై పవన్ త్రివిక్రమ్ చర్చ

స్పోర్ట్స్ డ్రామా మూవీ ‘సీటీమార్’ లోని ‘కబడ్డీ యాంతెమ్’ సాంగ్ ను అనురాగ్ కులకర్ణి, సాయి చరణ్, రమ్య బెహరా మరియు సాహితీ చాగంటి పాడారు. ఈ పాటకు సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి రాశారు. సాహిత్యం సినిమా నేపథ్యాన్ని ప్రతిబింబిస్తుంది. మణి శర్మ స్వరాలు సమకుర్చారు.

Exit mobile version