Tollywood: తెలుగు సినిమాపై జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇప్పుడు మన తెలుగు చిత్రసీమ ఇండియన్ సినిమాపై ఆధిపత్యం చెలాయిస్తుండడమే కాదు.. ప్రపంచ స్థాయి సినిమాలకు కూడా ధీటుగా పోటీనిస్తోంది. ఉన్నత ప్రమాణాలతో రూపొందుతూ.. విశేష ఆదరణను చూరగొనడంతో పాటు కలెక్షన్ల పరంగా సరికొత్త మైలురాళ్ళనే సృష్టిస్తున్నాయి. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి సినిమాలు విదేశాల్లోనూ ఎలా అలజడి సృష్టించాయో అందరూ చూశారు. ఆర్ఆర్ఆర్ అయితే కొన్ని ‘ద బ్యాట్‌మాన్’ సినిమానే వెనక్కు నెట్టేసింది.
అలాంటి మన టాలీవుడ్‌పై భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ‘‘ప్రస్తుతం తెలుగు సినిమాలు స్వల్ప కాలిక వినోదం మాత్రమే అందిస్తున్నాయి. తెలుగు సినిమాలు చూస్తూ తెలుగులో సబ్ టైటిల్స్ చదివి డైలాగ్స్ అర్ధం చేసుకునే దయనీయ స్థితికి తెలుగు సినిమాని నెట్టొద్దు’’ అని ఆయనన్నారు. లెజెండరీ దర్శకుడు కే. రాఘవేంద్రరావు రాసిన “నేను సినిమాకి రాసుకున్న ప్రేమలేఖ” అనే పుస్తక ఆవిష్కరణ సందర్భంగా పంపించిన వీడియో సందేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Janvi Kapoor : 'అచ్చియమ్మ' కూడా అచ్చి రాలేదే!
- Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తారా?
- Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా... జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
- Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..'తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా'
తెలుగు సినిమాల్లో ఇంగ్లీష్ మాటలు ఎక్కువగా ఉన్నాయని, అవి సగటు తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిల్ ఉండడం లేదని జస్టిస్ ఎన్వీ రమణ ఉద్దేశం. హాలీవుడ్ సినిమాలకి పోటీ ఇవ్వాలన్న మోజులో, తెలుగుని మర్చిపోవద్దని ఆయన మన మేకర్స్‌ని సూచిస్తున్నారు. నిజమే.. ఆర్ఆర్ఆర్లో విదేశీ నటులకు ఇంగ్లీష్ డైలాగులే ఉండడం పట్ల, చాలామంది ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తెలుగులో వాటిని డబ్ చేసి ఉంటే బాగుండేదని రిక్వెస్టులు చేశారు. తెలుగు వరకూ డైలాగుల్ని అనువదించి ఉంటే, బాగుండేది.
తాజావార్తలు
-
Devji : లాసెట్‌లో మెరిసిన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ..
-
Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
-
Hyderabad: దంపతుల మధ్య గొడవ.. తెల్లవారుజామున భార్యను భర్త ఏం చేశాడంటే..!
-
Malayalam: మలయాళం అంటే చిన్నచూపా?
-
Off The Record: ఎమ్మెల్యే శిరీష ఇరకాటంలో పడ్డారా..? అసలు కారణం ఏంటి?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!