సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. మహేష్ బర్త్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కి అర్థరాత్రి నుంచే కిక్ ఇస్తూ గుంటూరు కారం కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే పోస్టర్ ని వదిలిన మేకర్స్, బీడీ తాగుతున్న మహేష్ స్టైల్ తో అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో సోషల్ మీడియా అంతా #HappyBirthdayMaheshBabu #GunturKaaram #SSMB29 ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. గుంటూరు కారం ట్రెండ్ అవ్వడానికి పోస్టర్ కారణం అయితే SSMB 29 ట్రెండ్ అవ్వడానికి ఆ సినిమాపై ఉన్న భారీ అంచనాలు కారణం. రాజమౌళి, మహేశ్ బాబుల కాంబినేషన్ లో SSMB 29 తెరకెక్కనుంది. అడ్వెంచర్ డ్రామా, గ్లోబ్ ట్రాట్టింగ్ బ్యాక్ డ్రాప్, ఫ్రాంచైజ్ గా రూపొందుతుంది, ఇండియానా జోన్స్ రేంజులో ఉంటుంది… ఇలా అవకాశం దొరికినప్పుడల్లా రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ లు SSMB 29 గురించి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు.
ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపైన్ లో కూడా SSMB 29 సినిమా గురించి ఎలివేషన్స్ ఇచ్చాడు జక్కన్న. ఎక్కడికి వెళ్లినా రాజమౌళి SSMB 29 గురించే మాట్లాడుతూ ఉండడంతో వరల్డ్ వైడ్ ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్, ఇండియాస్ హయ్యెస్ట్ బడ్జట్ తో పాన్ వరల్డ్ సినిమా చేస్తే రికార్డులు కూడా పాన్ వరల్డ్ స్థాయిలోనే బ్రేక్ అవుతాయి. ప్రస్తుతం రాజమౌళికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం SSMB 29 సినిమా బాక్సాఫీస్ లెక్కలు 2000 కోట్ల నుంచి మొదలవుతాయి. ఆ రేంజ్ ప్రాజెక్ట్ తో బయటకి రాబోతున్న జక్కన్న, ఈరోజు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఒక్క అప్డేట్ ఇచ్చి ఉంటే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కాదు… ప్రపంచమే SSMB 29 జపం చేసేది. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్న జక్కన్న, మరి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి మరీ SSMB 29 గురించి ఎప్పుడు మాట్లాడుతాడో చూడాలి.
