Site icon NTV Telugu

RRR: ఇదెక్కడి క్రేజ్ రా మావా… మన ‘నాటు’ పాట BTSని చేరింది

Rrr

Rrr

ఆర్ ఆర్ ఆర్ ఇంపాక్ట్, నాటు నాటు పాట ఇంపాక్ట్ మన దేశ సరిహద్దులు దాటి చాలా కాలమే అయ్యింది. సరిగ్గా ఏడాది క్రితం రిలీజ్ అయిన ఈ యాక్షన్ ఎపిక్ మూవీ ఇండియన్ ఆడియన్స్ తో పాటు జపాన్ ఆడియన్స్ ని కూడా అట్రాక్ట్ చేసింది. ఎప్పుడూ లేనిది ఒక ఇండియన్ సినిమా వెస్ట్రన్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడం ఆర్ ఆర్ ఆర్ సినిమాకే చెల్లింది. ఈ మూవీ అంత రీచ్ రావడానికి ముఖ్యమైన కారణం నాటు నాటు పాట. ఈ పాట వైబ్ కి ప్రపంచం మొత్తం ఊగిపోతుంది. మార్చ్ 12న బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డ్ గెలుస్తుంది అనే నమ్మకం మన కన్నా వెస్ట్రన్ ఆడియన్స్ కి ఎక్కువగా ఉందంటే నాటు నాటు పాట రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఈ పక్కా ఊర మాస్ నాటు సాంగ్ రేంజుని మరింత పెంచుతూ వరల్డ్స్ బిగ్గెస్ట్ మ్యూజిక్ టీం అయిన BTSని కూడా మెప్పించింది.

BTS సభ్యుడు, సింగర్, లిరిసిస్ట్ అయిన వరల్డ్ ఫేమస్ ‘జంగ్‌కూక్’ నాటు నాటు సాంగ్ ని ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘జంగ్‌కూక్’ ఇన్‌స్టాగ్రామ్‌ ని వదిలేసినా తర్వాత… BTS యొక్క మాక్నే Weverseలో లైవ్ లోకి వస్తూ ఫాన్స్ కి కనెక్ట్ అవుతున్నాడు. ఇందులో భాగంగా మార్చ్ 2న లైవ్ లో ‘జంగ్‌కూక్’ తన సాంగ్స్ ప్లే  లిస్ట్ ని ఆడియన్స్ ని వినిపిస్తూ మధ్యలో ‘నాటు నాటు’ సాంగ్ ని ప్లే చేశాడు. ‘జంగ్‌కూక్’ మన పాటని వినడమే కాదు లిరిక్స్ ని హమ్ చేస్తూ, మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ కనిపించాడు. దాదాపు రెండున్నర నిమిషాలున్న ‘జంగ్‌కూక్’ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యింది. “మీకు ఈ పాట తెలుసా?” అని ఒక ఫ్యాన్ అడగగా… “ఇది ఆర్ ఆర్ ఆర్ సినిమాలోనిది… ఈ పాట చాలా బాగుంది” అంటూ ‘జంగ్‌కూక్’ రిప్లై ఇచ్చాడు.

ప్రస్తుతం BTS హోల్డ్ లో ఉంది. సౌత్ కొరియా చట్టాల ప్రకారం అక్కడి ప్రతి పౌరుడు ఆర్మీలో చేరి కొన్ని నెలల పాటు దేశ రక్షణలో భాగం కావాల్సి ఉంటుంది. ఈ కారణంగా 2025 వరకూ BTS నుంచి కొత్త ఆల్బమ్ బయటకి వచ్చే అవకాశం లేదు. గత పదేళ్లలోనే టాప్ మోస్ట్ ఆల్బమ్స్ ఇస్తూ వరల్డ్ బిగ్గెస్ట్ టీమ్స్ లో ఒకటిగా నిలిచినా BTS ఒక ఇండియన్ సాంగ్ వైబ్ ని ఎంజాయ్ చెయ్యడం గొప్ప విషయం. ప్రపంచంలో ఉన్న BTS ఆర్మీ మొత్తం ‘జంగ్‌కూక్’ మన పాటని వినీ ఎంజాయ్ చేసిన వీడియోని చూసి థ్రిల్ అవుతున్నారు.

Exit mobile version