Judicial Custody to Actress hema in Bangalore Drugs Case: బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో అనేక సంచలన అంశాలు తెరమీదకు వస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ బెంగుళూరు రేవ్ పార్టీకి మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ తెలుగు సినీనటి హేమ ఈ వ్యవహారంలో చిక్కుకోవడంతో పెద్ద ఎత్తున సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బెంగళూరు శివార్లలో ఒక ప్రైవేటు ఫామ్ హౌస్ లో పోలీసులు రేవు పార్టీ జరుగుతుందనే విషయం తెలుసుకుని వెళ్లి దాన్ని భగ్నం చేశారు. ఆ సమయంలో నటి హేమ కూడా అక్కడే ఉంది. తన పేరుని కృష్ణవేణిగా పోలీసుల వద్ద నమోదు చేయడంతో ఆమె విషయం పెద్దగా హైలైట్ అవ్వలేదు. అయితే ఆమెను చూసిన బెంగుళూరు రిపోర్టర్లకు అందరూ ఈమె హేమలా ఉందే అనే అనుమానంతో వార్త బయటకు వచ్చేలా చేయడంతో తాను హైదరాబాదులో చిల్ అవుతున్నానంటూ ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది.
What the Fish: ‘వాట్ ది ఫిష్’ కోసం ఒకేసారి నలుగురిని దింపారు!
బెంగళూరు పోలీసులు తమ దగ్గర ఉన్న రికార్డ్స్ చెక్ చేసి హేమ తమ అదుపులో ఉందంటూ ఫోటోతో పాటు ఆమె వీడియో షూట్ చేసిన ప్రదేశానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టారు. ఇక ఈ నేపథ్యంలో కేసు తప్పుదోవ పట్టిస్తోంది అంటూ ఆమె మీద మరో కేసు నమోదు చేశారు. రెండు సార్లు విచారణకు డుమ్మా కొట్టిన హేమ కోసం బెంగళూరు నుంచి చెందిన సిసిబి పోలీసులు ఈరోజు వచ్చి ఆమెను విచారించారు. ఇక విచారణ కోసం బురఖా ధరించి వచ్చిన హేమను సిసిబి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు మెడికల్ టెస్ట్ లు కూడా పూర్తి చేశారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం మేరకు హేమకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదయింది బెంగళూరులో కాబట్టి ఆమెను బెంగుళూరు జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.