విశ్వవిఖ్యాత నవరస నటనా సార్వభౌముడు నందమూరి తారక రాముడు శతజయంతి ఉత్సవాలకు రంగం సిద్ధమయ్యింది. తెలుగు టాప్ హీరోలందరూ ఈరోజు జరగనున్న ‘ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్’కి విచ్చేస్తున్నారు. ఆ మహానటుడుకి ఇండస్ట్రీ మొత్తం కదిలొచ్చి ఉత్సవాలు చెయ్యడం కన్నా గ్రేట్ ట్రిబ్యూట్ ఏముంటుంది చెప్పండి. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం అవనున్న ఈ వేడుకలకి ఎన్టీఆర్ రావట్లేదని వార్త సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాతకి తగ్గ మనవడిగా ఎన్టీఆర్ అనే పేరుని ప్రపంచానికి పరిచయం చేసిన ఎన్టీఆర్, శత జయంతి వేడుకలకి వస్తాడని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది.
Read Also: Rashmi Gautam : కార్లలో తిరిగే నీకేం తెలుసు వీధి కుక్కల గురించి.. రష్మిని ఏకేస్తున్న నెటిజన్స్
బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లని ఒకే వేదికపై చూసే అవకాశం వస్తుందని నందమూరి అభిమానులంతా ఎంతో ఆశగా ఎదురు చూసారు. ఇక మరి కొన్ని గంటల్లో ఈవెంట్ జరగబోతుంది అనుకునే లోపు ఎన్టీఆర్ రావట్లేదు అనే వార్త బయటకి వచ్చింది. మే 20న తన పుట్టిన రోజు కాబట్టి ఎన్టీఆర్ ముందు అనుకున్న కమిట్మెంట్స్ ప్రకారం ఫామిలీ, ఫ్రెండ్స్ తో ఉండబోతున్నాడు. ‘ఎన్టీఆర్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్’కి ఈ కారణంగానే ఎన్టీఆర్ రాలేకపోతున్నాడు అనే మాట వినిపిస్తోంది. ఇదే నిజమైతే ఎన్టీఆర్ ని బాలయ్యతో కలిసి చూడాలి అని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న నందమూరి అభిమానులందరూ నిరాశ చెందడం ఖాయం.
