Site icon NTV Telugu

RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్

RRR

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రీమియర్ షోలకు అద్భుతమైన రివ్యూలు వస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లతో పాటు ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరయ్యారు. అయితే సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ రియాక్షన్ ఏమై ఉంటుందా ? అనే డౌట్ అందరికీ వచ్చే ఉంటుంది. అయితే నందమూరి అభిమానులు ఖుషీ అయ్యేలా సినిమా చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక చిరునవ్వుతో బయటకు వచ్చాడు. మీడియాకు డబుల్ థంబ్స్ అప్ కూడా చూపించడం చూస్తుంటే తారక్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు అన్పిస్తోంది.

Read Also : RRR: అభిమానులకు గమనిక.. ఐదు థియేటర్లలోనే స్పెషల్ బెనిఫిట్ షో

డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, వీరితో పాటు ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version